manasu gathi inthe song lyrics in telugu

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసు గతి ఇంతే

 ఒకరికిస్తే మరలి రాదు  ఓడిపోతే మరిచిపోదు 
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరిచిపోదు 
గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదూ 
మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే 

అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు 
అంతా మట్టేనని తెలుసు అదీ ఒక మాయేనని తెలుసు 
తెలిసీ వలచి విలపించుటలో తియ్యదనం ఎవరికి తెలుసూ మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసు గతి ఇంతే 

మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో 
మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడేమౌతాయో 
మనిషికి మనసే తీరని శిక్షా దేవుడిలా తీర్చుకున్నాడు కక్షా మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే 
మనసున్న మనిషికీ సుఖము లేదంతే 
మనసు గతి ఇంతే


Comments