సిల్క్ స్మిత ఎందుకు చనిపోయిందో తెలుసా?

                                                       
Silk Smitha Death Mystery | Silk Smitha Death Reasons
Silk Smitha Death Mystery | Silk Smitha Death Reasons 

సిల్క్ స్మిత నాలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులను మాయ చేసిన అందాల తార. తన నిషా కళ్ళతో చూపరుల కళ్ళు తిప్పనివ్వకుండా చేసింది ఈ భామ. ప్రత్యేక గీతాలకు పెట్టింది పేరు. సినిమా రంగంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఎవరో కొద్దిమందికి మాత్రమే వస్తుంది. అలాంటి అదృష్టం సిల్క్ స్మితని వరించింది. తన సక్సెస్ కి అదృష్టం, కష్టం రెండు కారణాలు. అయితే అంతటి హోదాని అనుభవిస్తున్న సిల్క్ స్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటి దాకా మనకి తెలిసింది నాణేనికి ఒకవైపు మాత్రమే, రెండో వైపు అంతులేని విషాద గాధ ఉంది. తాను చనిపోయేటప్పుడు రాసిన సూసైడ్ లెటర్ లో వాటిని ప్రస్తావించింది.  సిల్క్ స్మిత చనిపోయేముందు రాసిన ఉత్తరం | Silk Smitha Suicide Letter

       ఇమాంది రామారావు.... ప్రముఖ  జర్నలిస్ట్, దర్శకుడు. సిల్క్ స్మిత జీవితం గురించి బాగా తెలిసినవాడు.  అతను సిల్క్ స్మిత ఆత్మహత్యకు గల కారణాలు చెప్పుకొచ్చారు.


సిల్క్ స్మిత సేవాగుణం కలది. ప్రతిఒక్కరికి మంచిచేయాలనే స్వభావం కలది. అప్పటి వరకు ప్రత్యేక నృత్యాలలో , నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటించిన సిల్క్ స్మితకు అది రొటీన్ అనిపించింది. ప్రతి రోజు ఇలా నటించడమేనా , ఇంకా ఏదైనా చేయాలనుకుంది. అందుకు ఆమె నిర్మాతగా మారింది. దీనికి ఇంకో కారణం కూడా వుంది.  నిర్మాతగా మారితే చిన్న కళాకారులకు, కొత్తగా వచ్చేవారికి మంచి అవకాశాలు ఇచ్చి ఆదుకోవచ్చు అనుకుంది. సినిమా తీస్తున్నన్ని రోజులు అందరూ తనవారే అన్నట్టు ఉండేవారు. సినిమా విడుదలయ్యాక అవి ఫ్లాప్ అవ్వడంతో అందరూ మొఖం చాటేశారు. అన్ని రోజులు మంచిగా ఉన్నవారు అందరూ, సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎవరూ తనని పట్టించుకోలేదు. అంత బోల్డ్ గా కనిపించే సిల్క్ అప్పుచేయడానికి చాలా భయపడేది. తను డబ్బు పోగొట్టుకొని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు తన దగ్గరకి రాలేదు. ఇదే కాకుండా సిల్క్ సినిమాల్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో గడ్డం  రాధాకృష్ణ  అనే డాక్టర్ పరిచయమయ్యాడు. అతను మొదట్లో సిల్క్ కాల్షీట్లు అన్ని చూసుకునేవాడు. మెల్లగా సిల్క్ కు దగ్గరయ్యాడు. తనను పెళ్లి చేసుకుంటానని , సిల్క్ డబ్బు వాడుకోవడం మొదలు పెట్టాడు. సిల్క్ ను పలు రకాలుగా బాధపెట్టాడు. ప్రతిరోజు ఏదోఒకరకంగా టార్చర్ చేసేవాడు.
సిల్క్ స్మిత చనిపోయే ముందు తన అమ్మ, తమ్ముడు ఎవరూ తనతో లేరు. అంతేకాకుండా గడ్డం రాధాకృష్ణతో ప్రతిరోజు గొడవలు. అతనిని వదిలించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. సిల్క్ డబ్బుకు మరిగిన అతడు ఆమెని వదలలేదు. ఎంతో కొంత డబ్బు వాడికి ఇచ్చి వదిలించుకోవాలనుకుంది. సిల్క్ కి మదర్ థెరిస్సా అంటే చాలా ఇష్టం. తాను  సంపాయించిన డబ్బు మదర్ థెరిస్సా ఆశ్రమానికి డొనేట్ చేసి కలకత్తాకి వెళ్లి అక్కడ ఆశ్రమంలో సేవ చేసుకుంటూ బతుకుదాం అని కూడా అనుకుంది.

                కానీ గడ్డం రాధాకృష్ణ సిల్క్ ని మానసికంగా చాలా కృంగదీసాడు. రాధాకృష్ణ చాలా క్రిమినల్ మైండెడ్ అవ్వడంతో ఆమె భయరపడలేక పోయింది. ఒకవేళ ఆమె వాడి నుంచి భయరపడుంటే ప్రాణాలతో ఉండిఉండేది. ఎందుకంటే తనకు చనిపోవడానికి అంతకు మించిన పెద్ద సమస్యలు లేవు. ఇంక డబ్బు విషయమంటారా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీరంగాల్లో తనకు అవకాశాలు మెండుగా  ఉన్నాయి. అయినప్పటికీ కూడా గడ్డం రాధాకృష్ణ చెతిలొనుంచి బయటపడలేక, అతని టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఈ సూసైడ్ కి పరోక్షకారణం గడ్డం రాధాకృష్ణ.
Gaddam Radhakrishna images, silk smitha boyfriens gaddam radhakrishna images
Silk Smitha and Gaddam Radhakrishna Images


              అయితే ఇమాంది రామారావు చివరలో ఇలా అన్నారు. అప్పట్లో సిల్క్ ది ఆత్మహత్య కాదు, హత్య అని 90% మంది అన్నారని, కానీ తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోలేదని, అది హత్యో, ఆత్మహత్యో ఆ భగవంతుడికే తెలియాలని అన్నారు.

            ఏదిఏమైనా 4 రాష్ట్రాలలో అంతటి స్టార్ డమ్ చూసిన నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరం.
   
   



Comments