Indira Gandhi Political Life , emergency , Operation Blue Star

"ఇందిరా ప్రియదర్శిని " ఇందిరా గాంధీ పూర్తి పేరు. ఇందిరా ప్రియదర్శిని కి ఇందిరా గాంధీ అనే పేరు ఎలా వచ్చిందంటే .    
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi Childhood images

 జవహర్ లాల్ నెహ్రు ఒక్కగానొక్క కూతురు. ఒక్కటే కూతురు కావడం, దేశంలోనే అంత సంపన్నమైన కుటుంబలో జన్మించడంతో చాలా గారాబంగా పెరిగింది. చిన్నప్పటినుంచి తన కుటుంబ సభ్యులందరు దేశానికీ , దేశప్రజలకు బ్రిటిష్ వారినుంచి విముక్తి కలిగించి, స్వాతంత్య్రాన్ని తీసుకురావడం కోసం చేసే పోరాటాలని చూస్తూ పెరిగింది. అంతే కాకుండా తన తాతగారు మోతిలాల్ నెహ్రు, తండ్రి జవహర్ లాల్ నెహ్రు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో  చురుకుగా పాల్గొనేవారు. అలా  రాజకీయరంగంపై కూడా మంచి పట్టు సాధించింది. తన తండ్రి చనిపోయాక ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టి, పలు కీలక నిర్ణయాలను తీసుకొని దేశంలో చెప్పుకోదగ్గ నాయకులలో ఒకరిగా నిలిచింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టిన "ఇందిరా గాంధీ" రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.

            ఇందిరా గాంధీ తన తండ్రి జవహర్ లాల్ నెహ్రు దగ్గర రాజకీయాలలో ఓనమాలు నేర్చుకుంది. తన తండ్రితో పాటు చాలా సంవత్సరాలు ఎలాంటి పదవి లేకుండానే రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ ప్రతిభని చూసిన  భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలు , వారి పార్టీకి 1952 ఫిబ్రవరి 2న  అధ్యక్షురాలిని చేశారు.  స్వతహాగా ధైర్యశాలి అయిన ఇందిరా గాంధీ, రాజకీయాలలో ప్రవేశించాక చాలా శక్తివంతంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రలు పోషిస్తూ తండ్రికి ధీటుగా పనిచేసింది. 1962 వ సంవత్సరంలో అస్సాం లోని తేజ్ పూర్ ప్రాంతం చైనా దాడికి గురయ్యింది. ఈ దాడి వల్ల అస్సాం ప్రజలను తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని పరిష్కరించడానికి ఇందిరా అక్కడకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆర్మీచీఫ్ , జవహర్ లాల్ నెహ్రు, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినా వినకుండా ఇందిరా తేజ్ పూర్ కి వెళ్లి అక్కడ సమస్యని చాకచక్యంగా పరిష్కరించింది. అక్కడి ప్రజలకు ధైర్యం నింపి, వారి సమస్యను తీర్చడంతో ఇందిరా గాంధీ తేజ్ పూర్ ప్రజలతోనే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రశంసలు అందుకుంది. ఇందిరా గాంధీ ధైర్యాన్ని , చాకచక్యాన్ని చూసిన జవహర్ లాల్ నెహ్రు రాజకీయపరంగా వచ్చే సమస్యలకి , ఇందిరా గాంధీ సలహాలను తీసుకోవడం మొదలుపెట్టారు.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi with Jawaharlal Nehru 

                          చైనా సరిహద్దు సమస్యల వల్ల జవహర్ లాల్ నెహ్రు , తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. నెహ్రు, పరిపాలన పట్ల, అతను తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఇదేక్రమంలో 1963లో కామరాజ్ ప్లాన్ తెరపైకి వచ్చింది. కామరాజ్ ప్లాన్ ఏంటి  అంటే ఏమిటంటే , సీనియర్ నేతలందరూ రాజీనామా చేసి, యువకులకు అవకాశమివ్వాలి. కామరాజ్ ప్లాన్ కి ఇందిరా గాంధీ అంగీకారం తెలిపింది. అప్పటికే నెహ్రూని ప్రధానమంత్రి పదవి నుంచి దింపేయాలని చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. కానీ నెహ్రూని సపోర్ట్ చేసేవారు మాత్రం నెహ్రు రాజీనామాని అంగీకరించలేదు. 1963 ఆగస్టు 25 న 11 మంది సీనియర్ నేతలు పదవులకు రాజీనామా చేశారు. దీనితో కామరాజ్ పార్టీకి కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.  దీని అనంతరం జవహర్ లాల్ నెహ్రు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీనితో ఇందిరా గాంధీ తన తండ్రిని చూసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించారు. రానురాను నెహ్రు ఆరోగ్యం క్షీణించిపోసాగింది. జనవరి 6 ' 1964 లో నెహ్రూ గారికి  పక్షవాతం వచ్చింది. ఇంకేముంది పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయి. ఒకవైపు  నేను ప్రధాని అంటే నేను ప్రధాని అని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కానీ నెహ్రు గారికి మద్దతిచ్చే వాళ్ళు మాత్రం నెహ్రూగారే తదుపరి ప్రధానమంత్రిని ప్రకటించాలని కోరారు. వీటన్నింటిని అధిగమించడానికి నెహ్రూగారు , నేను ఆరోగ్యంగానే ఉన్నాను, మీరు చింతించకండి అని చెప్పారు. కానీ నెహ్రూ 1964 మే 27 న మరణించారు. గుల్జారీలాల్ నంద తాత్కాలిక ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టారు.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi with his father 


          నెహ్రు మరణించిన తర్వాత ఆయన స్థానంలో ప్రధానమంత్రి భాద్యతలు చేపట్టాలని లాల్ బహదూర్ శాస్త్రి కోరారు. కానీ అప్పటికే నెహ్రు పాలనపై  వున్న వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకొని , పదవిని తిరస్కరించారు. ఎందుకంటే తన తండ్రి పాలనపై వున్న వ్యతిరేకత తన మీద పడుతుందని భావించి లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిగా ఉండమన్నది. 1964, జూన్ 9 న భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా  పదవీ భాద్యతలు చేపట్టారు.  రాజకీయాలపై అప్పట్లో ఇందిరా గాంధీ అంతగా శ్రద్ధ చూపలేదు. కానీ లాల్ బహాదుర్ శాస్త్రి కోరిక మేరకు రాజ్యసభ కు ఎన్నికై లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి వర్గంలో కేబినెట్ హోదా కలిగిన సమాచార, ప్రసార మంత్రిగా పదివీబాధ్యతలు చేపట్టారు ఇందిరా గాంధీ. తాను మంత్రి పదవిలో వున్నప్పుడు పలు కీలక సమస్యలను అవలీలగా పరిష్కరించింది. అందులో చెప్పుకోదగ్గది ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని నేతలు ప్రజలపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చారు. దీనిని దక్షిణభారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. రానురాను ఈ సమస్య పెద్దదవడంతో ఇందిరాగాంధీ స్వయంగా దక్షిణాదికి వచ్చి ఇష్టమున్నవారే హిందీ నేర్చుకోవాలని, ఇష్టం లేనివారు నేర్చుకోవాల్ససిన అవసరం లేదని చెప్పారు. ఇకపై ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి ప్రజలపై ఉండదని హామీ ఇచ్చి వెళ్లారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 10 న గుండెపోటుతో మరణించారు. లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయాక గుల్జారీలాల్ నంద తాత్కాలిక ప్రధానమంత్రిగా భాద్యతలు చేపట్టారు.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi as Prime Minister of India


               మళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ప్రధానమంత్రిని చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి చాలాపేర్లు లిస్టులో వచ్చినప్పటికీ ఇందిరా గాంధీ, గుల్జారీలాల్ నంద, మొరార్జీదేశాయ్ లలో ఒక్కరిని ప్రధానమంత్రిగా చేయాలనుకున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామరాజ్ ఇందిరా గాంధీకి మద్దతును తెలపడంతో ఇందిరా గాంధీ 1966 జనవరి 24 న ప్రధానమంత్రిగా నియమింపబడింది. మనదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. ఒక మహిళ రాజకీయాలలో ఉండటమే గొప్ప విషయం , అలాంటిది ఏకంగా ప్రధానమంత్రి అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారత ప్రజలే కాకుండా, వేరే దేశాలు కూడా ఇందిరా గాంధీ పనితీరుపై ఆసక్తి చూపాయి. మొరార్జీదేశాయ్ కి కీలక భాద్యతలను అప్పజెప్పింది. ఉప ప్రధానమంత్రి మరియు ఆర్థికశాఖామంత్రిగా నియమించింది. దీనితో మొరార్జీదేశాయ్ కొంతవరకు శాంతించాడనే చెప్పాలి. ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇది ఇందిరా గాంధీకి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. తను చదువుకున్న చదువు, తను నేర్చుకున్న బహుళ భాషలు, ఇతర దేశాల గురించి అవగాహన ఉండటం, చిన్నప్పటి నుంచి స్వాతంత్య్ర సమరయోధులతో సన్నిహితంగా మెలగడం. రాజకీయాలను దగ్గరనుంచి పరిశీలించడం వంటి ఎన్నో అంశాలు ఇందిరాని ది బెస్ట్ ప్రధానమంత్రిగా చేయడానికి సహాయపడ్డాయి. అంతేకాకుండా తనదగ్గరకు వచ్చే సమస్యలను , తనకున్న అనుభవంతో త్వరితగతిన పరిష్కరించేది.  దేశాన్ని అభివృద్ధి చేసే విషయమై పలు దేశాలతో సంబంధాలను ఏర్పరచుకుంది. ఇందిరా మాట్లాడే పద్దతి, సమస్యలు వాటి పరిష్కారాలపై తనకుండే అవగాహనకు వేరే దేశ అధ్యక్షులు సైతం ఫిదా అయ్యారు.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi Political life 


   1967లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలు పోగొట్టుకుంది. కానీ ఇందిరా గాంధీ విజయం సాధించింది. ఈ సారి ప్రధానమంత్రి పదవికి చాలామంది ధనవంతులు, రాజకీయాల్లో వున్న అనుభవజ్ఞులు, మహామహులు వీరితో పారు మొరార్జీదేశాయ్ కూడా ప్రధానమంత్రి పోటీగా ఉన్నారు. మల్లి సీన్ రిపీట్ అయ్యింది. చివరికి ఇందిరా గాంధీ  , మొరార్జీదేశాయ్ మాత్రమే పోటీలో మిగిలారు. అప్పటికే ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరా రాజకీయాలలో అపార జ్ఞానాన్ని సంపాదించింది. తన ప్రధానమంత్రి పోటీకి అడ్డుగా వున్న మొరార్జీదేశాయ్ ని చాలా చాకచక్యంగా పోటీలో నుంచి విరమించేలా చేసింది. ఇంకేముంది మల్లి ప్రధానమంత్రిగా భాద్యతలు కొనసాగించింది. ఈ సారి మొరార్జీదేశాయ్ కి డిప్యూటీ ప్రధాని భాద్యతలను అప్పజెప్పింది.

       రాను రాను పార్టీలో సమస్యలు ఎక్కువయ్యాయి. పార్టీలోని నాయకుల మధ్య విభేధాలు తలెత్తాయి. ఈ క్రమంలో పార్టీలో నాయకులను నియమించే క్రమంలో ఇందిరా గాంధీ చాలా వ్యతిరేకతను ఎదుర్కొంది. ఏదైతేనేం తాను నామినేట్ చేసినవారే ముఖ్యపదవులకు ఎంపిక అయ్యారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి బ్యాంకులను జాతీయం చేసింది. పార్టీలో దీనిని వ్యతిరేకించిన వారందరు కలసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు.  క్రమంగా పార్టీలో చీలిక మొదలయింది. ఇందిరకు వ్యతిరేకులందరు కాంగ్రెస్ " ఓ " గా, ఇందిరాకు మద్దతు ఇచ్చే వారందరు కాంగ్రెస్ ( ఆర్ ) గా విడిపోయారు. కాంగ్రెస్ రెండు ముక్కలయిపోయింది. దీనితో ఇందిరా గాంధీకి మెజారిటీ తగ్గిపోయింది. ఇంకేముంది ఇందిరా పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇందిరకు, ఇండిపెండెంట్ సభ్యులు, మిగిలిన పార్టీలు మద్దతు తెలపడంతో, ఇందిరా గాంధీ వ్యతిరేకీయులకు చుక్కెదురైంది. అవిశ్వాస తీర్మానంలో ఇందిరా నెగ్గింది. ఈసారి మరింత ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టింది. ఆమెని వ్యతిరేకిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది.  అప్పటివరకు వున్న జమిందారీ వ్యవస్థను రద్దుచేయడంలో కీలకపాత్ర పోషించింది.  అంతేకాకుండా దేశంలోని పేదరికాన్ని పారద్రోలడానికి గరీబీ హటావో అనే నినాదంతో దేశమంతా పర్యటించి, ఎన్నో సభలలో పాల్గొని, ప్రత్యక్షముగా ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను విని సానుకూలంగా స్పందించి, మీకు నేనున్నానంటూ దైర్యం చెప్పింది. దేనితో ఇందిరా గాంధీ దేశంలోనే గొప్ప నేతగా పేరుసంపాదించుకుంది..

                   అప్పటికే రెండుసార్లు వరుసగా ప్రధాని అయిన ఇందిరాగాంధీ మూడోసారి కూడా భారీ మెజారిటీతో ప్రధానమంత్రిగా ఎన్నికైంది. తన శత్రువులంతా కలిసి తనను గద్దె దింపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా,  పార్టీని రెండుగా చీల్చినా ఏమాత్రం అధైర్య పడకుండా పార్టీని విజయవంతంగా నడిపింది. ఈసారి ఇందిరా చాలా పెద్ద సమస్యలను పరిష్కరించింది. అందులో ముఖ్యమైనవి  "బాంగ్లాదేశ్ ఆవిర్భావం",  "బ్యాంకుల జాతీయీకరణ " , "పాకిస్థాన్ యుద్ధం " వంటివి చాలా ముఖ్యమైనవి.  చాలా వరకు ఈ విషయాల్లో విజయాన్ని సాధించింది. కానీ దేశంలో పెరుగుతున్న పేదరికాన్ని, లంచగొండితనాన్ని తగ్గించలేక పోయింది . దీనితో ఇందిరా గాంధీ పై దేశప్రజలలో వ్యతిరేకత రావడం మొదలయింది. ఇందిరా గాంధీని గద్దె దింపే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వారికీ ఇది మంచి అవకాశంగా అనిపించింది.ఇదే "ఎమర్జెన్సీ "కి దారితీసింది. ఈ సమయంలో సంజయ్ గాంధీ , పలు కీలక పాత్ర పోషించాడు.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi at Jail , was Indira Gandhi Arrested 



                  విషయమేమిటంటే 1971 లో అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలలో ఇందిరా గాంధీ ఓటర్లకు డబ్బు పంచిందని, ప్రభుత్వ అధికారులను ఎన్నికలలో తన విజయానికి ఉపయోగించుకుందని ఇందిరతో పోటీపడి ఓడిపోయిన రాజ్ నారాయణ్ , ఇందిరా గాంధీ విజయం చెల్లదని హైకోర్టులో పిటిషన్ వేసాడు. ఈ విషయంపై విచారణ చేపట్టిన కోర్టు, ఇందిరా ప్రభుత్వ ఆధికారులను ఎన్నికలలో ఉపయోగించుకుందని నిర్ధారించిన అలహాబాద్  హైకోర్టు 6 సంవత్సరాల పాటు ఎన్నికలలో పాల్గొనరాదని 1975లో తీర్పు ఇచ్చింది. దీనితో ఇందిరా గాంధీ సుప్రీంకోర్టు నుంచి స్టే  ఆర్దరుని తెచ్చుకుంది. దీనితో ఇందిరా గాంధీ ప్రత్యర్థులు, వ్యతిరేకులు, శత్రువులు అంతా కలిసి ర్యాలీలు చేపట్టారు. దీని పర్యవసానం ముందుగానే పసిగట్టిన ఇందిరా రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం 1975 జూన్ 25 న ఎమర్జెన్సీ ని ప్రకటించింది. ఎమెర్జెన్సీ తో దేశంలో అల్లకల్లోలాన్ని ఆపింది కానీ, ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను ఆపలేకపోయింది. దీని పర్యవసానమే 1977 ఎన్నికలలో దారుణ ఓటమి. తన సొంతనియోజక వర్గంలో కూడా గెలవలేక పోయింది. ఫలితంగా జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. 1977 మార్చి 22 న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసింది.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi emergency 


           ఇప్పుడు ఇందిరా గాంధీ మీద పగతీర్చుకునే అవకాశం వచ్చింది. ఇందిరా గాంధీని పలు కేసుల్లో ఇరికించారు. కానీ అవి ఏవి నిలవలేదు. ఇప్పుడు సరికొత్త వ్యూహంతో , కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి  "ఇందిరా కాంగ్రెస్" ని తన మద్దతు దారులతో ఏర్పాటు చేసారు . దానికి అధ్యక్షురాలిగా భాధ్యతలు చేపట్టారు ఇందిరా గాంధీ. 1978నవంబర్ 7 న పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు . కర్ణాటకలోని చిక్ మంగళూరు ప్రాంతంలో పోటీచేసి లోక్ సభకు పోటీ చేసి  భారీవిజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఇందిరా గాంధీ మల్లి ట్రాక్ లో కి వచ్చింది. మొరార్జీ దేశాయ్ పాలనలో ఎన్నో అవినీతులు జరిగాయి. అంతే కాకుండా కనీసావసర వస్తువులరేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. దీనితో ప్రజలలో వీరిపై వ్యతిరేకత పెరిగింది. ఇది కాంగ్రెస్ కి మంచి అవకాశం . దానిని సద్వినియోగం చేసుకోవాలనుకుంది ఇందిరా గాంధీ. అంతే మొరార్జీ దేశాయ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇందులో అతను నెగ్గలేక పోయాడు. తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసాడు. ఈసారి  ఇందిరా కాంగ్రెస్ మద్దతుతో జనతా పార్టీకి చెందిన  చరణ్ సింగ్ ప్రధానమంత్రి భాద్యతలు చేపట్టాడు. కానీ ఇతను ఒక నెలలోపల అతని బలాన్ని నిరూపించుకోవాల్సి వుంది. కానీ ఇందులో చరణ్ సింగ్ విఫలమయ్యారు. ఇతను తన భాద్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. దేనితో ఇందిరా గాంధీ 23 రోజులకే తన మద్దతుని విరమించుకుంది. దీనితో లోక్ సభ రద్దయింది. తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో ఇందిరా 529   స్థానాలకు గాను 351 స్థానాలలో విజయం సాధించి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికలలో  ఇందిరా గాంధీ సాధించిన విజయానికి , తన విరోధులు కళ్ళు బయర్లుకమ్మాయి.

                  ఈ సారి ప్రధానమంత్రిగా 1980 ,జనవరి లో  పదవీ భాద్యతలు చేపట్టింది. ఈ సారి తాను ఎదుర్కోబోయే సమస్యలు ఇందిరా గాంధీ మరణానికి దారితీస్తాయని ఎవరూ ఊహించలేదు. కానీ తాను దేశభద్రత కోసం తీసుకునే నిర్ణయాల వల్ల తనకు ప్రాణహాని ఉంటుందని ఇందిరా గాంధీ కి బాగా తెలుసు. అయినా సరే వెనకడుగేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగమే " ఆపరేషన్ బ్లూ స్టార్ ". సిక్కుల కోసం జరిగే పోరాటంలో ఎంతో మంది అమాయకపు ప్రాణాలు సిక్కు నాయకుడు బింద్రన్ వాలే ఉద్యమకారుల చేతులో బలవుతుంటె, ఆ ఉద్యమాన్ని ఆపటానికి ఆపరేషన్ బ్లూ స్టార్ తో వారిని అంతమొందించింది. ఈ ఆపరేషన్ లో సిక్కుల స్వర్ణదేవాలయం దెబ్బతింది. దీనితో సిక్కుల ఇందిరా గాంధీ పై పూర్తి వ్యతిరేకతను చూపారు. ఇందిరా గాంధీపై చాలా కోపాన్ని వ్యక్తంచేశారు. ఇదే ఇందిరా గాంధీ మరణానికి దారితీసింది.  1980' అక్టోబర్ 31 న తన బాడీగార్డు లైన ఇద్దరు సిక్కు వ్యక్తులు సత్వన్త్ సింగ్, బియాంత్ సింగ్ ,ఇందిరా గాంధీ ని తుపాకీతో కాల్చిచంపారు.
ఇందిరా గాంధీ తన  చివరి రక్తబొట్టు దాకా దేశంకోసం పోరాడతానన్న మాటలను నిజం చేసింది. దేశం ఒక గొప్ప ప్రధానమంత్రిని కోల్పోయింది. సంపన్న కుటుంబలో పుట్టినా , దేశం ఏమైతే ఏంటి అనే ధోరణి లేకుండా, తన చిన్నవయసు నుంచి దేశంకోసం పోరాడింది. ఆ పోరాటంలో భాగంగానే తన ప్రాణాల్ని కోల్పోయింది. తన భర్త , తండ్రి, కుమారుడి మరణాలను తట్టుకుని, ధైర్యంతో దేశాన్ని ముందుకు నడిపించిన ఇందిరా గాంధీ దేశంలోని మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది.
Indira Gandhi Political Life in Telugu, Indira Gandhi Political Life essay, Indira Gandhi essay, Indira Gandhi as PM, Indira Gandhi Biography, Indira Gandhi Political Career, Indira Gandhi Assassination, Indira Gandhi Biography Books, Indira Gandhi Indian National Congress
Indira Gandhi Assassination , Indira Gandhi cremation  

Comments