Khalistan Movement in Telugu | Bhindranwale

ఖలిస్థాన్  ఉద్యమం :



Khalistan Movement in Telugu
Khalistan Map | Khalistan movement in India

ఖల్సా అంటే పంజాబీ భాషలో పవిత్రం అని అర్థం. ఖలిస్తాన్ అంటే పవిత్రభూమి అని అర్థం వస్తుంది. భారతదేశానికి బ్రిటీష్ వారి నుంచి విముక్తి కలిగాక , ఎంతో కాలం ఆ ఆనందం నిలవలేదు భారత ప్రజలలో. అంతవరకు బ్రిటిష్ వారిముందు  అణిగిమణిగి వున్న భారతీయులు స్వాతంత్య్రం రాగానే దేశవిభజన కోసం  ఒక్కసారిగా హింసాకాండను మొదలుపెట్టారు. ముస్లిం లు  పాకిస్తాన్ దేశం ఎలా కావాలన్నరో, సిక్కులు కూడా తమకంటూ ప్రత్యేకంగా ఒక దేశం కావాలని ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమమే "ఖలిస్తాన్."
Khalistan Movement in Telugu
Khalistan movement | why Khalistan movement failed


                       పంజాబ్ ప్రాంతంలో దేశంల పాకిస్థాన్ విభజనకు ముంది ఎక్కువగా హిందువులు ఉండేవారు. కానీ పాకిస్తాన్ విభజన అనంతరం పాకిస్థాన్ లోని హిందువులు, సిక్కులు పంజాబ్ ప్రాంతం లోకి వలస వచ్చి అక్కడే స్థిరపడ్డారు. దీనితో పంజాబ్ రాష్ట్రంలో సిక్కుల జనాభా పెరిగిపోయింది. 1941 వ సంవత్సరంలో పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో సిక్కుల జనాభా 19.8% ఉండేది. విభజన తర్వాత 0.1 % మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన సిక్కులందరు భారతదేశానికి వచ్చేసారు.  దీనితో వారు కూడా ఒక ప్రత్యేక దేశం కావాలని ఖలిస్థాన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.

బ్రిటిష్ వారు మనదేశానికి రాకముందు సిక్కులను ఎవరు పరిపాలించారు :

బ్రిటిష్ వారు మనదేశానికి రాకముందు పంజాబ్ , పరిసర ప్రాంతాలలోని సిక్కులను సిక్కు మిస్ల్ అనే సమాఖ్య పరిపాలించింది. దీనిని బందబహదూర్ స్తాపించాడు. వీరు ఈ సమాఖ్య ద్వారా 1767 - 1799 వరకు పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలించారు. తర్వాత మహారాజ రంజిత్ సింగ్ సిక్కుసామ్రాజ్యంలో కలిసే వరకు 1799- 1849 వరకు పరిపాలించారు.

ఖలిస్థాన్ ఉద్యమం ఎలా మొదలైంది :

మనదేశాన్ని బ్రిటిష్ వారు చాలా సంవత్సరాలుగా పరిపాలించారు. భారతీయులు పరాయి దేశస్థులు కింద  బానిస బ్రతుకును బతికారు. మనదేశానికి స్వతంత్రం కొన్ని నెలల్లో రాబోతోందనగా మొదలైంది ఈ దేశవిభజన ఉద్యమాలు. దీనికి ఎవరి మతాల వారిని వారు పరిపాలించుకోలేమా అనే భావన ఒక ఎత్తు అయితే,  "విభజించు - పాలించు " అనేబ్రిటిష్ వారి పరిపాలన విధానం కూడా మరొక కారణం.  ఈకారణాల వల్లనే మతాల ప్రాతిపదికన దేశాన్ని విడదీయాలని ముస్లింలు ప్రత్యేక దేశంకోసం " ముస్లిం లీగ్ " ఆధ్వర్యంలో  ఉద్యమాలు చేపట్టారు. దీనిని సిక్కులు తీవ్రంగా వ్యతిరేకించారు. మనదేశం స్వతంత్రం వచ్చే ముందు హిందూ, ముస్లిం, సిక్కులకు జరిగిన ఉద్యమాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది స్త్రీలు మానభంగానికి గురయ్యారు. చాలామంది కాళ్ళు , చేతులు నరికివేయబడ్డాయి. ఇళ్లను తగలబెట్టడంతో వేలాదిమంది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఊర్లకు ఊర్లె వలస వెళ్లిపోయాయి. పసిపిల్లల్ని కూడా వదలలేదు. దేశం మొత్తం రక్తం ప్రవహించింది. ఈ మారణఖాండ గురించి ఇప్పటికి మనలో చాలామందికి తెలియదు. చివరికి మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో ముస్లింలు  పాకిస్తాన్ ని ఏర్పాటుచేసుకున్నారు. దీనితో సిక్కులు కూడా ఖలిస్తాన్ ను ఏర్పాటు చేయాలనీ ఖలిస్తాన్ ఉద్యమాన్ని చేపట్టారు. 



1980 లలో బింద్రన్ వాలే సారధ్యంలో ఖలిస్థాన్ ఉద్యమం :

1980 వ సంవత్సరం ప్రారంభంలో జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే సారధ్యంలో ఈ ఉద్యమం ఓరకంగా ఊపందుకుంది. బింద్రన్ వాలే పంజాబ్ లోని రాజకీయాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఈ సమయంలో బింద్రన్ వాలే  పంజాబ్ లో సిక్కులపై వున్న సిక్కులు వివక్షతకు గురవుతున్నారని, ఆర్థికంగా, సామాజిక పరంగా వెనకబడిపోయారని, ఇలాగే ఉంటె సిక్కుల మనుగడ కష్టమవుతుందని బింద్రన్ వాలే  భావించాడు.  సిక్కుల సంక్షేమం కోసం ఏదైనా చేయాలనీ భావించాడు. ఈ క్రమంలో పంజాబ్ లో జరిగిన ఎన్నికలలో సిక్కు ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఇందిరా గాంధీ ( కాంగ్రెస్ పార్టీ ) , తమ ప్రత్యర్ధ పార్టీ అకాళీ దళ్ ని ఓడించడానికి బింద్రన్ వాలేకి మద్దతు ఇచ్చింది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెస్ ప్రధాన నాయకులు కూడా బింద్రన్ వాలే కి మద్దతు ఇచ్చారు. దీనితో 1980లో జరిగిన ఎన్నికలలో బింద్రన్ వాలే పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థులైన గుర్డియల్ సింగ్ ధిల్లన్ , రఘునందన్ లాల్ భాటియాకు మద్దతు ఇచ్చాడు.
Khalistan Movement in Telugu
Bhindranwale | Bhindranwale khalistan movement

            తర్వాతి రోజులో అకాళీ దళ్ పార్టీ, బింద్రన్ వాలే డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని అతనితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 1982 ఆగస్టులో మోర్చా ( Morcha ("Group for the Religious fight") ) ను స్థాపించారు. మోర్చా అనగా మతపరమైన పోరాటం కోసం వుండే సమూహం . ఇందులో వారు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. అవి అన్ని నెరవేరే వరకు దీనిని విడిచిపెట్టకూడదని భావించారు . ఈ మోర్చా ఉద్యమంలో భాగంగా సిక్కులు పలు హింసలకు పాల్పడ్డారు. అందులో పంజాబ్ ముఖ్యమంత్రి దరబారా సింగ్ హత్య ముఖ్యమైనది. 

ఎయిర్ ఇండియా బాంబ్ దాడి :

            భారతదేశంలోని పంజాబ్ లో అత్యధికంగా సిక్కు మతస్థులు ఉన్నారు. వీరు ప్రత్యేక దేశం " ఖలిస్థాన్ " కోసం ఎన్నో సంవత్సరాలుగా హింసతో కూడిన ఉద్యమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. 1970 మరియు 1980 మధ్యకాలంలో ఈ ఉద్యమం ఉధృతమైంది. ఇందులో భాగంగా 1985 జూన్ 23 న ఎయిర్ ఇండియా విమానంపై జరిగిన బాంబు దాడిలో విమానంలో ప్రయాణిస్తున్న 329 మంది మరణించారు.ఈ మారణకాండ కూడా మోర్చా ఉద్యమంలో భాగమే. దీనితో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత ప్రభుత్వం ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ సిక్కులు ఈ ఉద్యమాన్ని ఆపలేదు.


ఆపరేషన్ బ్లూ స్టార్ :

రానురాను సిక్కుల అరాచకాలు ఎక్కువ అయిపోయాయి. వీటిని ఎలాగైనా అణిచివేయాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భావించారు. బింద్రన్ వాలే మరియు ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది తెలుసుకుని బింద్రన్ వాలే బృందం ఎక్కడైనా తలదాచుకోవాలనుకున్నారు. 1983 జులైలో ,తమకు మద్దతిస్తున్నరాజకీయ పార్టీ  అకాలీదళ్ అధ్యక్షుడు హర్ చరణ్ సింగ్ లాంగోవాల్  బింద్రన్ వాలేని మరియు అతని బృందాన్ని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లో తలదాచుకోమని చెప్పాడు. దీనితో బింద్రన్ వాలే అక్కడే నివాసం ఏర్పరుచుకుని ఆయుధాల్ని కొనుగోలు చేసి, తిరుగుబాటు స్థావరంగా మార్చుకున్నాడు. 

           బింద్రన్ వాలే బృందం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న మోర్చా ఉద్యమంలో భాగంగా , సిక్కు ఉగ్రవాదులు 165 మంది హిందువులను చంపారు. అంతే కాకుండా వీరిని వ్యతిరేకించిన 39 మంది సిక్కులను సైతం చంపేశారు. వీరు చేసిన అల్లర్లలో దాదాపు 410 మంది మరణించారు. 1,180 మంది గాయపడ్డారు. 

             దీనితో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎలాగైనా సరే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది.  దీని కోసం ఆపరేషన్ బ్లూ స్టార్ కు ప్రణాళిక రచించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కులకు వ్యతిరేకం కాదు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకం. ప్రణాళిక రచించిన అనంతరం భారతదేశ సైనికులకు ఆపరేషన్ బ్లూ స్టార్ ని ప్రారంభించామని ఆదేశించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ కి ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్ నేతృత్వం వహించారు. కుల్దీప్ సింగ్ బ్రార్ కూడా సిక్కు మతానికి చెందినవాడు. 1984 జూన్ 3 వ తేదీన భారత సైన్యం కుల్దీప్ సింగ్ బ్రార్ నేతృత్వంలో గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టారు. బింద్రన్ వాలేని మరియు ఉగ్రవాదుల్ని లొంగిపోవాలని ఆదేశించారు. కానీ వారు లొంగిపోలేదు. ఇక చేసేదేమి లేక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్ లో వున్న సందర్శకులను బయటకు విడిచిపెట్టమని కోరారు. కానీ వారు విడిచిపెట్టలేదు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు.

            ఉగ్రవాదులు కూడా భారీ మొత్తంలో ఆయుధాలను కలిగివున్నారు.  ఉగ్రవాదులు ఎంతసేపటికి లొంగిపోకపోవడంతో ఇక చేసేదేమి లేక సైనికులు కాల్పులు చేపట్టారు. 24 గంటలు కాల్పులు జరిపిన తర్వాత గోల్డెన్ టెంపుల్ సైనికుల ఆధీనంలోకి వచ్చింది. ఈ కాల్పుల్లో బింద్రన్ వాలే మరణించాడు. ఈ ఆపరేషన్లో భారత ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 1592 మందిని పట్టుకున్నారు. 493 మంది మరణించారు. ఇందులో ఉగ్రవాదులు మరియు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు సైనికులనుంచి తప్పించుకోవడానికి సాధారణ పౌరులను అడ్డుపెట్టుకోవడంతో ఎక్కువమంది అమాయకపు ప్రజలు బలి అయ్యారు.


ఇందిరా గాంధీ హత్య :

ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల ఖలిస్థాన్ ఉద్యమం కొంతవరకు అణిచివేయబడింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ని అమలుచేసిన ఇందిరా గాంధీ ని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని  సిక్కులు భావించారు. అంతే 1984 అక్టోబర్ 31 వ తేదీన ఉదయాన్నే ఆమె సిక్కు మత  బాడీగార్డ్ లు అయిన సత్వాన్ట్ సింగ్ మరియు బీన్ట్ సింగ్ ఆమెని తమ వద్ద వున్న తుపాకులతో కాల్చి చంపారు. ఇందిరా గాంధీ హత్యతో ఉత్తర భారతదేశంలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 3,000 మంది సిక్కులు మరణించారు. 

1984 తర్వాత ఖలిస్థాన్ ఉద్యమం :

ఇందిరా గాంధీ తనయుడు ,రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కుల సమస్యని పరిష్కరించాలనుకున్నాడు. ఇందులో భాగంగా రాజీవ్- లాంగోవాల్ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇందులో సిక్కులు ఖలిస్థాన్ ఉద్యమం విరమించాలి. దీనికి కొంతమంది సిక్కులు అంగీకరించలేదు.  ఈ సమస్య అక్కడితో సమసిపోలేదు. మల్లి ఈ ఉద్యమం అనేక హింసాచర్యలకు పాల్పడింది. 1987 వ సంవత్సరంలో లాలూ సమీపంలో బస్సులో ప్రయాణిస్తున్న 32  హిందువులను ఉగ్రవాదులు హతమార్చారు. అంతేకాకుండా 1991 లో లుథియానాలో 80 మంది ప్రయాణికులను చంపారు . హిందువులను చంపడం మాత్రమే కాదు, వారిని వ్యతిరేకించిన పాత్రికేయులను, సిక్కుమతస్థులను సైతం చంపేశారు. 

ఖలిస్తాన్   ఉగ్రవాద సంస్థలు :

సిక్కులకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి అనేక ఉగ్రవాద సంస్థలు ఏర్పాటయ్యాయి.
వాటిలో ముఖ్యమైనవి :

1. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ 
2. ఖలిస్థాన్ కమెండో ఫోర్స్ 
3. ఆల్ ఇండియా సిఖ్ స్టూడెంట్ ఫెడరేషన్ 
4. ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్ 
5. ఖలిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 

2000 వ సంవత్సరం తర్వాత సిక్కు ఉగ్రవాదంపై సిక్కుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ఉద్యమం చాలా వరకు సమిసిపోయింది. కానీ కొంత మంది  సిక్కులు మాత్రం ఇంకా ఖలిస్తాన్ ని కోరుకుంటున్నారు. 




Comments