Operation Blue Star in Telugu | Operation Blue Star

ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే ఏంటి ?


"ఆపరేషన్ బ్లూ స్టార్ " ఉగ్రవాదులను అంతమొందించడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అవలంభించిన ప్రతిష్టాత్మక ప్రయోగం. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో   గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ భవనాలలో దాక్కుని వున్న ఖలిస్థాన్  ఉద్యమనాయకుడు బింద్రన్ వాలే మరియు అతని బృందాన్ని అంతమొందించడమే  ఆపరేషన్ బ్లూ స్టార్ ప్రధాన లక్ష్యం. ఆపరేషన్ బ్లూ స్టార్ 1984 జూన్ 1 నుంచి జూన్ 8 1984 వరకు  జరిగింది. ఈ ఆపరేషన్ లో నాయకత్వం వహించిన 6 గురు జనరల్స్ లో 4 గురు సిక్కులు ఉన్నారు.

         
Operation Blue Star in Telugu
Operation Blue Star in Telugu
  1983 జులైలోఉగ్రవాదులకు,మద్దతిస్తున్నరాజకీయ పార్టీ  అకాలీదళ్ అధ్యక్షుడు హర్ చరణ్ సింగ్ లాంగోవాల్  బింద్రన్ వాలేని మరియు అతని బృందాన్ని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ లో తలదాచుకోమని చెప్పాడు. దీనితో బింద్రన్ వాలే అక్కడే నివాసం ఏర్పరుచుకుని ఆయుధాల్ని కొనుగోలు చేసి, తిరుగుబాటు స్థావరంగా మార్చుకున్నాడు. 

           బింద్రన్ వాలే బృందం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకున్న మోర్చా ఉద్యమంలో భాగంగా , సిక్కు ఉగ్రవాదులు 165 మంది హిందువులను చంపారు. అంతే కాకుండా వీరిని వ్యతిరేకించిన 39 మంది సిక్కులను సైతం చంపేశారు. వీరు చేసిన అల్లర్లలో దాదాపు 410 మంది మరణించారు. 1,180 మంది గాయపడ్డారు. 

             దీనితో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎలాగైనా సరే ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది.  దీని కోసం ఆపరేషన్ బ్లూ స్టార్ కు ప్రణాళిక రచించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ సిక్కులకు వ్యతిరేకం కాదు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకం. ప్రణాళిక రచించిన అనంతరం భారతదేశ సైనికులకు ఆపరేషన్ బ్లూ స్టార్ ని ప్రారంభించామని ఆదేశించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ కి ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కుల్దీప్ సింగ్ బ్రార్ నేతృత్వం వహించారు. కుల్దీప్ సింగ్ బ్రార్ కూడా సిక్కు మతానికి చెందినవాడు. 1984 జూన్ 3 వ తేదీన భారత సైన్యం కుల్దీప్ సింగ్ బ్రార్ నేతృత్వంలో గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టారు. బింద్రన్ వాలేని మరియు ఉగ్రవాదుల్ని లొంగిపోవాలని ఆదేశించారు. కానీ వారు లొంగిపోలేదు. ఇక చేసేదేమి లేక భారత సైన్యం గోల్డెన్ టెంపుల్ లో వున్న సందర్శకులను బయటకు విడిచిపెట్టమని కోరారు. కానీ వారు విడిచిపెట్టలేదు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పంజాబ్ పోలీసులు పాల్గొన్నారు.

            ఉగ్రవాదులు కూడా భారీ మొత్తంలో ఆయుధాలను కలిగివున్నారు.  ఉగ్రవాదులు ఎంతసేపటికి లొంగిపోకపోవడంతో ఇక చేసేదేమి లేక సైనికులు కాల్పులు చేపట్టారు. 24 గంటలు కాల్పులు జరిపిన తర్వాత గోల్డెన్ టెంపుల్ సైనికుల ఆధీనంలోకి వచ్చింది. ఈ కాల్పుల్లో బింద్రన్ వాలే మరణించాడు. ఈ ఆపరేషన్లో భారత ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం 1592 మందిని పట్టుకున్నారు. 493 మంది మరణించారు. ఇందులో ఉగ్రవాదులు మరియు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ఉగ్రవాదులు సైనికులనుంచి తప్పించుకోవడానికి సాధారణ పౌరులను అడ్డుపెట్టుకోవడంతో ఎక్కువమంది అమాయకపు ప్రజలు బలి అయ్యారు.

జూన్ 1: జూన్ 1 వ తేదీన ఉగ్రవాదులతో చర్చలు జరిపింది భారత ప్రభుత్వం. కానీ ఈ చర్చలు ఫలించలేదు. 

జూన్ 2:  కాశ్మీర్ నుండి రాజస్థాన్ లోని గంగా నగర్ వరకు, అంతర్జాతీయ సరిహద్దుకు సీల్ వేసింది. పంజాబ్ రాష్ట్రం మొత్తం భారత సైనిక బలగాలు పోలీసులు మోహరించారు. గ్రామాల్లో ఉన్న ఉగ్రవాదులను పట్టుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో రైలు, బస్సు, విమాన సేవలను రద్దు చేసారు. అంతేకాకుండా విద్యుత్ , నీటి సరఫరా కూడా నిలిపివేశారు. విదేశీయులకు, ఎన్ ఆర్ ఐ లకు కూడా పంజాబ్ లోకి ప్రవేశం లేకుండా చేశారు. దీనితో పంజాబ్ రాష్టం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మీడియా , ప్రెస్ మొత్తం గగ్గోలు పెట్టారు. 

జూన్ 3:  సిక్కు మత 5 గురువు అయిన అర్జన్ ( 17 వ శతాబ్దం ) యొక్క అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిక్కులను గోల్డెన్ టెంపుల్ లోకి వెళ్ళడానికి సైనికులు అనుమతించారు. ఈ క్రమంలో 200 మంది ఉగ్రవాదులు తప్పించుకున్నారు.

      జూన్ 3 వ తేదీన భారత సైనికులు గోల్డెన్ టెంపుల్ ఆవరణం మొత్తం చుట్టుముట్టాయి. బింద్రన్ వాలే ని మరియు ఉగ్రవాదులను లొంగిపోమని సైనిక దళాలు మైకులలో అనౌన్స్ చేశారు.  అంతేకాకుండా గోల్డెన్ టెంపుల్ లో వున్న సందర్శకులను విడిచిపెట్టమని కోరారు. అయినా సరే ఉగ్రవాదులు విడిచిపెట్టలేదు. జూన్ 5 తేదీ రాత్రి 7 గంటల వరకు గడువు ఇచ్చారు. కానీ ఉగ్రవాదులు లొంగిపోలేదు, సందర్శకులను విడిచిపెట్టలేదు. 

       దీనితో ఇంక ఉగ్రవాదులపై భారతసైన్యం కాల్పులు జరిపింది. కాల్పులు మూడు రోజుల పాటు జరిగాయి. జూన్ 8 వ తేదికి ఆపరేషన్ బ్లూ స్టార్ ముగిసింది. ఆపరేషన్ బ్లూ స్టార్ జరుగుతున్నప్పుడు ఆర్మీ చీఫ్గా  జనరల్ అరుణ్ శ్రీధర్ పనిచేసారు. ఆయన్ని 1986 లో పుణేలో హర్జిందర్ సింగ్ జిందా, సుఖ్ దేవ్ సింగ్ సుఖా అనే సిక్కులు అరుణ్ శ్రీధర్ ని హత్య చేశారు. వీరిద్దరికి ఉరిశిక్ష ఖరారు అయింది. 1992 అక్టోబర్ 7 వతీదీన ఇద్దరు సిక్కులను ఉరితీశారు. 

ఇందిరా గాంధీ హత్య :

ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల ఖలిస్థాన్ ఉద్యమం కొంతవరకు అణిచివేయబడింది. ఆపరేషన్ బ్లూ స్టార్ ని అమలుచేసిన ఇందిరా గాంధీ ని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని  సిక్కులు భావించారు. అంతే 1984 అక్టోబర్ 31 వ తేదీన ఉదయాన్నే ఆమె సిక్కు మత  బాడీగార్డ్ లు అయిన సత్వాన్ట్ సింగ్ మరియు బీన్ట్ సింగ్ ఆమెని తమ వద్ద వున్న తుపాకులతో కాల్చి చంపారు. ఇందిరా గాంధీ హత్యతో ఉత్తర భారతదేశంలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో 3,000 మంది సిక్కులు మరణించారు. 

         
            ఆపరేషన్ బ్లూ స్టార్ జరగకముందు, జరిగిన తర్వాత ఉన్న ప్రస్థితులను, సంఘటనలను "ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు అసాసినేషన్ అఫ్ ఇందిరా గాంధీ " అనే ఒక డాక్యూమెంటరీ ని తీశారు. దీనికి పునీత్ శర్మ దర్శకత్వం వహించారు. 


Comments