- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అల్లా
పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ
శ్రీ రామా
శుభకరుడు సురుచిరుడు
భవహరుడు భగవంతుడెవడూ
కల్యాణ గుణఘనుడు
కరుణా ఘనా ఘనుడు ఎవడూ
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా
అలరారు అందాల చంద్రుడెవడూ
ఆనంద నందనుడు
అమృత రస చందనుడు
రామ చంద్రుడు కాకా ఇంకెవడూ
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవ సాగరం
ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘన మూర్తి
ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మ జన్మల ఆర్తి
ఆ మూర్తి ఏ మూర్తియును గానీ రస మూర్తి
ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి
తాగరా తాగరా ...... శ్రీ రామ నామామృతం
ఆ నామమే దాటించు భవ సాగరం
శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా
కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా
మపనిసరి సానీ పానీపామా
సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా
ఆనందరామా
మా మా రిమరిమరి సరిమా
మా మా రిమరిమరి సరిమా
రామా జయరామా
సరిమా రామా సపమా రామా
పా ఆ ఆ ఆ వన రామా
సరిమా రామా సపమా రామా
పా ఆ ఆ ఆ వన రామా
ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొలిచెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నింటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలను గల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైమోడ్పు
తాగరా తాగరా శ్రీ రామా నామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం
allah srirama song lyrics
allah srirama song lyrics annamayya
allah srirama song lyrics annamayya movie
allah srirama song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment