NTR emantivi emantivi dialogue lyrics in telugu

యమా
ఏమంటివి ఏమంటివి
మానవ జాతి నీచమా ????
ఎంత మాట ఎంత మాట
వైతరణి వరకు వెంటాడి వేధించి
ముప్పతిప్పలు పెట్టి
మీ ధర్మ సూత్రములను మంటగలిపి
పతి ప్రాణములు దక్కించుకున్న
నారీమణి సావిత్రిదేజాతి? మానవ జాతి
తన భక్తితో సాక్షాత్ పరమ శివుడినే
ప్రత్యక్షం గావించి మీ పాశమును సైతం
గడ్డి పోచగానించి ప్రాణ హరులైన మిమ్ములనే
ప్రాణ భయంతో పరుగులెత్తించిన
పసివాడు మార్కండేయుడిదే జాతి??
మా నవజాతి
నీచ నీచమన్న మా జాతి మూలమున
ఏనాడో అప్రతిష్ట మూటకట్టుకున్న మీరు
నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా??
ఎంత అవివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారము
నేటి నుంచి దేవుడధికుడు నరుడధముడు
అన్న కించ భావాన్ని కూకటి వేళ్ళతో సైతం
పెకలించి వేసెదా
మొక్కులు పొందే ముక్కోటి దేవతలు
దిక్కుల నేలే అష్టదిక్పాలకులు
మనుగడ నిచ్చే పంచ భూతములు సైతం
హే జయహో నరుడా అని హర్షించు విధముగా
సింహాసనమధిష్టించెదా
స్వర్ణ మణిమయ రత్న ఖచితాలంకృతమైన
ఈ సభా మందిరమున
అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మద్యమున
భూతల పరి రక్షణా ధర్మ నిలయమైన
ఆ ఈ రౌరవమున
సర్వదా శతదా శతదా సహస్రదా
పాప పంకిలమైన కుల మత జాతి కూపమును
సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించెద
ఎనీ డౌట్స్ ??

ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు డైలాగ్ లిరిక్స్
దానవీరసురకర్ణ డైలాగ్ లిరిక్స్ ఇన్ తెలుగు

Comments