divya bharathi death cause in telugu

దివ్య భారతి చిన్న వయసులో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి , వెండితెరతో సినీ అభిమానులకు దగ్గరై కొంత సమయం వ్యవధిలోనే ప్రముఖ నటి గా పేరుతెచ్చుకుంది. కానీ అవేవి తనకి ఎక్కువ కాలం మిగలలేదు. కేవలం 19 సంవత్సరాల వయసులో అకాలమరణానికి గురయింది.

       దివ్యభారతి 1974 ఫిబ్రవరి 25  ముంబైలో జన్మించింది. ఈమెకి తను స్కూల్ కి వెళ్తున్న సమయం నుంచే మోడలింగ్ పై ఆసక్తి ఉండేది. దీనితో తాను మోడలింగ్ రంగంలోకి  అడుగుపెట్టింది. ఇదే క్రమంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మొట్టమొదటగా విక్టరీ వెంకటేష్ సరసన బొబ్బిలిరాజా (1990 సెప్టెంబర్ 24 ) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో తెలుగులోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది.

                  ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో దర్శకుడు, నిర్మాత అయిన సాజిద్ నడియాడ్ వాలా ను 1992 మే 10 వ తేదీన వివాహం చేసుకుంది. కేవలం మూడు సంవత్సరాల కాలంలో 20 సినిమాలలో ( తెలుగు, హిందీ భాషల్లో ) నటించి ఆ దశకంలో ప్రముఖ కథానాయికగా ఎదిగింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న దివ్యభారతి 1993 ఏప్రిల్ 19 న అనుమానాస్పద స్థితిలో మరణించింది. తాను ముంబైలో నివాసముంటున్న తుల్సి బిల్డింగ్స్ అపార్ట్మెంట్ అయిదవ అంతస్తు బాల్కనీ నుంచి పడి మరణించింది.  తను బాల్కనీ లోంచి కిందపడి మరణించే సమయంలో తనతో పాటు తన అతిధులు అయిన నీతా లుల్లా, నీతా భర్త శ్యామ్, దివ్యభారతి పనిమనిషి అమ్రిత వున్నారు. వీరితో పాటు అపార్ట్మెంట్ లో ఉన్న వారికి కూడా దివ్యభారతి మరణం గురించి అవగాహన వుంది.

దివ్య భారతి నటించిన సినిమాల లిస్ట్

                రక్తపుమడుగులో వున్న దివ్యభారతిని అంబులెన్సు లో కూపర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ దివ్యభారతి పడిపోయిన చోటే మరణించింది. అయితే దివ్యభారతి మరణంపై అప్పట్లో  ఎన్నో అనుమానాలు రేకెత్తించాయి. కొందరు మాత్రం దివ్యభారతికి మద్యం అలవాటు ఎక్కువగా ఉండటంతో, మద్యం సేవించిన సమయంలో ప్రమాదవశాత్తు బాల్కనీ లోంచి కిందపడి మరణించి ఉంటుందని నమ్ముతున్నారు. కేవలం తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ తన నటన, అందంతో యావత్ సినీఅభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. కేవలం తాను 4 సంవత్సరాలు మాత్రమే సినిమా రంగంలో వున్నప్పటి
21 సినిమాలలో నటించి రికార్డు సృష్టించింది. కానీ 19 సంవత్సరాల వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయి సినీప్రపంచానికి తీరని లోటు మిగిల్చింది. 

Comments