greekuveerudu song lyrics in telugu


గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ
కలల్లోనె ఇంకా ఉన్నాడూ
ఫిల్ము స్టారులూ క్రికెట్టు వీరులూ
కళ్ళుకుట్టి చూసే కుర్రాడూ
డ్రీమ్ బాయ్
రూపులో చంద్రుడు  చూపులో సూర్యుడు
డ్రీమ్ బాయ్
ఊరనీ పేరనీ జాడనే చెప్పడూ
ఏమి చెప్పనూ ఎలాగ చెప్పనూ
ఎంత గొప్పవాడే నావాడూ
రెప్ప మూసినా ఏటైపు చూసినా
కళ్ళముందు వాడే ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు

నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నపోదా
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా
స్టయిలు లో వాడంత వాడు లేడూ
నన్ను కోరినా మగాల్లు ఎవ్వరూ నాకు నచ్చలేదే
వాట్ టు డు
నేను కోరినా ఏకైక పురుషుడూ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎందుకో ఆకలీ నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు

లోకమంత ఒక్కటైన లెక్కచేయనన్నవాడు
కోరుకున్న ఆడపిల్ల కళ్ళముందు నిలవ లేడు
చూస్తా ఎన్నాళ్ళు దాగుతాడు
కన్నె ఊహలో వుయ్యాలలూగుతూ
ఎంత అల్లరైనా చేస్తాడూ
ఉన్నపాటుగా కొర్రుక్కు తిననుగా
ఎందుకంత దూరం ఉంటాడూ
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలనీ
ఎవ్వరూ వాడితో చెప్పరే ఎదురుగా రమ్మనీ
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు
గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు

Comments