niluvaddamu song lyrics in telugu

త్రిష, సిద్దార్థ్  నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని పాటలన్ని అద్భుతంగా ఉంటాయి. అందులోని " నిలువద్దము " పాట లిరిక్స్ మీకోసం . 

నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా
నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా
ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా
నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా
నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా
అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా

లర లాయ్ ల లాయ్ ల లే
లర లాయ్ ల లాయ్ ల లే
లర లాయ్ ల లాయ్ ల లే లాయ్ లే

నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

హా ప్రతి అడుగు తనకు తానే
సాగింది నీవైపు నామాట విన్నట్టు
నేనాపలేనంతగా
భయపడకు అది నిజమే
వస్తోంది ఈ మార్పు నీకోతి చిందుల్ని
నాట్యాలుగా మార్చగా
నన్నింతగా మార్చేందుకు
నీకెవ్వరిచ్చారు హక్కు
నీప్రేమనే ప్రశ్నించుకో ఆనింద నాకెందుకు

లర లాయ్ ల లాయ్ ల లే
లర లాయ్ ల లాయ్ ల లే
లర లాయ్ ల లాయ్ ల ల  లాయ్ లే

నిలువద్దము నిను ఎప్పుడైనా
నువ్వు ఎవ్వరు అని అడిగేనా
ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా

ఇదివరకు ఎదలయకు
ఏమాత్రము లేదు హోరెత్తు ఈ జోరు
కంగారు పెట్టేంతగా
తడబడకు నన్ను అడుగు
చెబుతాను పాఠాలు లేలేత పాదాలు
జలపాత మయ్యేట్టుగా
నాదారినే మళ్ళించగా నీకెందుకో అంత పంతం
మన చేతిలో ఉంటే కాదా ప్రేమించడం మానటం

లర లాయ్ ల లాయ్ ల లే
లర లాయ్ ల లాయ్ ల లే
లర లాయ్ ల లాయ్ ల ల  లాయ్ లే

త్రిష నటించిన తెలుగు సినిమాల లిస్ట్

Comments