rangula puttillu sankranti song lyrics in telugu

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు
పట్టు పరికిణి కట్టి సుక్కల వరసలు పెట్టి
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి
కోడితో పందెం కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

పంతాలతో రగిలిన మన రాయలసీమ
ఆనందాలకు సంక్రాంతే చిరునామా
పౌరుషాల వెలివేసిన పండుగ నీవు
ప్రేమలతో ప్రతి గుండెల పెనవేసావు
తెలతెలవారుతుంటే రాజేసే భోగి మంట
కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసేనంట
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా
ఊరిని తలుచుకొని తన్మయమే చెందేనట
ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి
తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతి
ప్రేమల చిరునామా రాయలసీమ
అనురాగాల రాగం పాడేనమ్మా
పసిడి కోనసీమ పంటచేల నడుమ
పరువాల గోదావరి పారేనమ్మా
పంటలు కానుక ఇచ్చి  రైతుల కలలను తీర్చి
పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి
పచ్చి పాలజల్లు పచ్చని పొదరిల్లు
పైరులతో పల్లెలన్నీ విలసిల్లు
మంచు పూలజల్లు పరిమళాలు చల్లు
వేలాది పువ్వుల కల్లాపిని చల్లు
ఏరువాక ఎదల మీద పంటను తీసి
సంచారజాతికింత దానం చేసి
గోమాత, భూమాతల పూజలు చేసి
హరిదాసుల కీర్తనలు గానం చేసి
నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణం
బొమ్మల కొలువులోన కొలువుదీరే పసితనం
పసుపు కుంకుమలే పడతులకు వాయనం
గగనం తాకునమ్మా గాలిలోన పతంగం
స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం
ఉత్తర దిక్కున భానుడి సంచారం
తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం

రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు
పట్టు పరికిణి కట్టి సుక్కల వరసలు పెట్టి
సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి
కోడితో పందెం కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి
ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి
రంగుల పుట్టిల్లు తెలుగు లోగిళ్ళు
ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు
కురిసె మంచుజల్లు తెరిచే పూల కళ్ళు
గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్థిల్లు

మంగ్లీ శివరాత్రి స్పెషల్ సాంగ్ ఎండి కొండాలు ఏలేటోడా
మంగ్లీ సంక్రాంతి స్పెషల్ సాంగ్ లిరిక్స్ భోగిమంటలు సంక్రాంతులు

Comments