asha pasham song lyrics in telugu

ఆశ పాశం బంధీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరే లోగానే ఏతీరౌనో
సేరువైన సేదు దూరలే
తోడవుతోనే ఈడే వైనాలే
నీదో కాదో తేలే లోగానే ఏదేటౌనో
ఆటు పోటు గుండె మాటుల్లోనా  సాగేనా

ఏ లే లే లేలో
కల్లోలం ఈ లోకంలో
లో లో లోలోతుల్లో
ఏ లేలో ఎద కొలనులో.

నిండుకున్నవేల మబ్బుకమ్ముకొచ్చి 
సిమ్మసికటెళ్ళి పోతుంటె, 
నీ గమ్యం గందరగోళం
దిక్కుతోచకుండ తల్లడిల్లిపోతు 
వల్లటిల్లిపోయి నేవుంటే 
తీరేనా నీ ఆరాటం
ఏ హేతువు నుదిటి రాతల్ని మార్చిందో 
నిశితంగా తెలిసేదెలా
రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలి గా

ఆటు  పోటు గుండె మాటుల్లోనా
సాగేనా
ఆశ పాశం బంధీ సేసేలే
సాగే కాలం ఆడే ఆటేలే
తీరా తీరం సేరే లోగానే ఏతీరౌనో

ఏ జాడలో ఏమున్నదో
క్రీనీడల విధి వేచున్నదో
ఏ మలుపులో ఎం దాగున్నదో
నీవు గ తేల్చుకో నీ శైలిలో

సిక్కుముల్లుగప్పి రంగులీనుతున్న 
లోకమంటె  పెద్దనాటకమే 
తెలియకనే సాగే కథనం
నీవు బెట్టుకున్న నమ్మకాలు అన్ని 
పక్కదారిబట్టి పోతుంటే కంచికినీ కథలే దూరం
నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి 
ఎదురేగి సాగాలి గా 
రేపేటౌనో తేలాలంటే నువ్వెదురుసూడాలి గా
 ఓ
ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా

Comments