dhaayi dhaayi dhaamma song lyrics in telugu

దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ 
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ
ఒహో హో  ఒళ్ళో వాలుమా ఒహో హో
వయసే ఏలుమా 
నిలువెల్లా విరబుసే నవ యవ్వనాల కొమ్మ 
తొలిజల్లై తడిమేసే సరసాల కొంటెతనమా 
హే దాయి దాయి దామ్మ కులికే కుందనాల బొమ్మ 
నీతో పని ఉందమ్మా నడిచే కొడపల్లి బొమ్మ 
దాయి దాయి దామ్మ పలికే గండు కోయిలమ్మ 
నీపై మనసైందమ్మ నా నిండు చందమామ 

టక టకమంటు తలపును తట్టి తికమకపెట్టే 
లుకుముకి పిట్ట నినువదిలితే ఎట్టా 
నిలబడమంటూ నడుముని పట్టి కితకితపెట్టే 
మగసిరి పట్ట కథ ముదిరితే ఎట్టా 
కేరింతలాడుతు కవ్వించలేవా 
కాదంటే ఇపుడు తప్పేదెలా 
అరె కాదంటే ఇపుడు తప్పేదెలా 
నీ కౌగిలింతకు జాలంటూ లేదా 
ఏం దుడుకు బాబూ అపేదెలా 
అయ్యె ఏం దుడుకు బాబూ అపేదెలా 
ఒహో హో  కోరిందే కదా 
ఒహో  హో  మరీ ఇందిర 
మరికొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా 
వ్యవహారం శృతిమించే సుకుమారి బెదిరిపోదా 
హాయి హాయి హాయే అరెరే పైట జారిపోయే 
పాప గమనించవే మా కొంప మునిగిపోయే 

పురుషుడినిట్టా ఇరుకున పెట్టే పరుగుల పరువా 
సొగసుల బరువా ఓ తుంటరి మగువా 
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా ఎగబడ లేవా 
తగు జతకావ నా వరసై పోవా 
అల్లాడిపోకే పిల్లా మరీ ఆ కళ్యాణ ఘడియ రానీయవా 
ఆ కళ్యాణ ఘడియ రానీయవా 
అరె అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి శృతిమించవా 
నీ హితబోధలాపి శృతిమించవా 
ఒహో  హో వాటం వారెవా 
ఒహో హో ఒళ్లోవాలవా 
అనుమానం కలిగింది నువు అడపిల్లవేనా 
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైన 
హే దాయి దాయి దామ్మా కులికే కుందనాల బొమ్మ 
నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ 
హే హే హే హాయి హాయి హాయే కొరికే కళ్ళు చేరిపోయే 
అయినా అది కూడా ఏదో కొత్త కొంటే హాయే

Comments