lokanayakuda song lyrics in telugu

లోకమందున నిన్ను మించగా లేరు 
నీదు పుట్టుక భరతమాతకే పేరు
లోకమందున నిన్ను మించగా లేరు 
నీదు పుట్టుక భరతమాతకే పేరు
లోక నాయకుడా  లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం 
ఇక నీ కోసం ఆగే కాలం

నటనకు నవత తరగని యువత 
నీ రసహృదయం రాయని కవిత
నటనకు నవత తరగని యువత 
నీ రసహృదయం రాయని కవిత
అభినయ సిరిగా అభినవ గిరిగా
వచ్చాడు రసరాజు 
నిను చూసి మెచ్చాడు నటరాజు 
శోధనలెన్నో ఎదురే ఐనా 
సాధన మాత్రం నువు విడలేదు 
చిన్ననాటి ఆ చిలిపితనానికి 
ఆక్సిజన్ పెంచినావు 
త్వరలోనే ఆస్కారు పొందుతావు

లోకమందున నిన్ను మించగా లేరు 
నీదు పుట్టుక భరతమాతకే పేరు
లోక నాయకుడా  లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం 
ఇక నీ కోసం 

నారాయణునిది దశావతారం 
నటనలో నీది నూరవతారం 
ముసుగులు తీసి మనసులు తెలిసి 
మనీషివైనావు జ్ఞానంలో ఫ్రాయిడ్‌ని మించినావు 
విత్తులలోనే వృక్షాలు ఎదుగు 
నీ ఒక్కనిలో లోకాలు ఒదుగు 
విశ్వవిజేతగా ఎదిగిన నటుడా 
నీ సరి నీవేలే
ఎప్పటికీ నీ సరి నీవేలే

లోకమందున నిన్ను మించగా లేరు 
నీదు పుట్టుక భరతమాతకే పేరు
లోక నాయకుడా  లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం 
ఇక నీ కోసం ఆగే కాలం
లోక నాయకుడా  లోక నాయకుడా
లోక నాయకుడా  లోక నాయకుడా

Comments