- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
శభాష్!
ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ళ జాడగాదు
గుర్రం నీళ్ళ గుట్టాకాడ
అలుగు వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రాతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల
పుట్టిండాడు పులిపిల్ల
నల్లమల తాలూకాల
అమ్మ పేరు మీరాబాయి
నాయన పేరు సోమ్లగండు
నాయన పేరు సోమ్లగండు
తాతా పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టినపేరు భీమ్లానాయక్
శభాష్ భీమ్లానాయకా
భీమ్లానాయక్
భీ....మ్లానాయక్
ఇరగదీన ఈడి ఫైరు సల్లగుండ
ఖాకి డ్రెస్సు పక్కనెడితే వేడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ధి తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా
విరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో
సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్జునట్టా మడతెట్టినాడో
రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగ్గట్టినాడో
తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీ….......మ్లానాయక్
భీ….మ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపొద్ది ఎన్నుపూస
కుమ్మడంలో వీడే ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు
ఆ నేమ్ ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్
బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భం భం భీం భీమ్లానాయక్
దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవక్
గుంటూరుకారం ఆ యూనిఫారం
మంటెత్తిపొద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లాఠీ విహారం
పేట్రేగిపోద్ధి నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం
ఆల్ రౌండ్ ది క్లాక్ పిస్తోలు దోస్తే
భీమ్లానాయక్
భీమ్లానాయక్
ఎల్లమ్మ ఎల్లమ్మ
bheemla nayak movie songs lyrics in telugu
bheemla nayak song lyrics in telugu
bheemla nayak title song lyrics in telugu
pawan kallyan hit song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment