- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
కోలు కోలో కోలోయమ్మ
కొమ్మ చివరనా పూలు పూసే కోలో
కొమ్మ చివరనా పూలు పూసే కోలో
పూవులాంటి సిన్నదేమో మొగ్గయింది సిగ్గుతోటి కోలోయమ్మా
కోలు కోలమ్మ కోలో కోలో
నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదు లే
కోలు కోలమ్మ కోలో కోలో
నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదులే
ఏ పిల్లగాడి మాటలన్నీ గాజులల్లే మార్చుకుంట
కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా
కుర్రగాడి చూపులన్నీ కొప్పులోను ముడుచుకుంటా
అల్లరంతా నల్లపూసలంటా
వాడి గూర్చే ఆలోచనే వాడి పోనీ ఆరాధనే
తాళి లాగ మెళ్ళో వాలదా
కోలు కోలమ్మ కోలో కోలో నా సామి
మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదు లే
పాదమేమో వాడిదంట పయనమేమో నావి అంట
వాడి పెదవితోటి నవ్వుతుంటా
అక్షరాలు వాడివంట అర్థమంతా నేను అంటా
వాడి గొంతుతోటి పలుకుతుంటా
ప్రాణమంతా వాడేనంటా ప్రాయమంతా వాడేనంటా
వాడి ప్రేమై నేనే బ్రతకనా
కోలు కోలమ్మ కోలో కోలో
నా సామి మనసే మేలుకొని చూసే
కలలో నిండిన వాడే కనుల ముందర ఉంటే
నూరేళ్లు నిదుర రాదులే
kolu kolu song lyrics
kolu kolu song lyrics in telugu
kolu kolu song lyrics in telugu from virataparvam movie
raana kolu kolu song lyrics in telugu
sai pallavi kolu kolu song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment