- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అఅఅ ఆట అఅఅ ఆట
ఏ జెండాపై కపిరాజుంటే రథమాపేదెవరంట
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట
అఅఅ ఆట అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశల దీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే పెంచే వేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతి పూట
ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేటా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంతా
పులి మీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాధించే సత్తావుంటే సమరం ఒక సయ్యాట
తల వంచుకు రావలిసిందే ప్రతి విజయం నీ వెంట
అల్లాద్దీన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జత కోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేకవీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటువెళ్ళారు సినిమా హీరోలంతా
దివి నుంచే దిగిరాలేదు మన తారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జైకొడతారు అభిమానులై జనమంతా
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాటా
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట
అఅఅ ఆట అఅఅ ఆట
అఅఅ ఆట అఅఅ ఆట
aata title song lyrics from aata movie
aata title song lyrics in telugu
aata title song lyrics in telugu from aata movie
siddarth aata title song lyrics in telugu from aata movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment