- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ
ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే
నాతో మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ
ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి ఈ
చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ
ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ
inthaku nuvvevaru song lyrics
inthaku nuvvevaru song lyrics in telugu
inthaku nuvvevaru song lyrics in telugu from snehitudaa movie
nani inthaku nuvvevaru song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment