- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
ప్రేమకోసం ఏకంగా తాజ్ మహలే కట్టాడు
షాజహానుకి పనిలేదా అనుకున్నాను
ప్రేమకన్నా లోకంలో గొప్పదేది లేదంటూ
చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను
ఓహ్ ఓహ్ ఓహ్ అరేయ్ ఇంతలో
ఏదేదో జరిగిందిరో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నేకూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
హో ప్రేయసి ఊహల్లో లైఫ్ అంతా గడిపేస్తూ
అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి
వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
గాలిలోన రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను
మాటిమాటికి తడబడుతుంటే
రాతిరిదింకా దిగలేదనుకున్నాను
ఓహ్ ఓహ్ ఓహ్ అది ప్రేమని
ఈరోజే తెలిసిందిరో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో
నే కూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
హో చూపులతో మొదలై గుండెల్లో కొలువై
తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు
కానీ ఇప్పుడు ఉమ్
నీకోసం పుట్టి నీకోసం పెరిగే
హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు
కానీ ఇప్పుడు ఉమ్
ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను
ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కణ్ణే ఎందుకు మిస్ అయ్యాను
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ రోజులా ఏ రోజూ అవలేదురో
ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నేకూడా తడిసానురో
కన్నులు తెరిచే కలగంటామని ప్రేమికులంటుంటే
అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే
అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను
కానీ ఇప్పుడు ఉమ్
kannulu teriche song lyrics
kannulu teriche song lyrics in telugu
kannulu teriche song lyrics in telugu from bommarillu
siddartha kannulu teriche song lyrics in telugu from bommarillu movie
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment