konchem kaarangaa song lyrics in telugu

కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా 
అందించని అదిరే అదరాంజలి 
బంధించని కాలాన్ని కౌగిలి 
సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి 
మంచల్లే నిమిరే నీ జాలే
మంటల్లె నను మరిగించాలి 
కొంచెం కారంగా కొంచెం గారంగా 
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా 

తలుపేసుకుంటే నీ తలపాగుతుందా 
మదిలో నువ్వుంటే స్నానం సాగుతుందా 
నీ విషమే తాకింది నరనరమున 
ఇక నా వశము కాకుంది యమయాతనా
లేనిపోని నిందలుగాని హాయిగానే ఉంది గానీ 
ఉన్నమాట నీతో చెప్పనీ
కొంచెం కారంగా కొంచెం గారంగా
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా 

అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ 
లాగావు గుట్టు గుండెల్లోకి చూస్తూ 
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా 
నువ్వు ఏమేమి చేసావో చెబుతుండగా 
మనసు ఉంది మన్మథ లేఖ 
కెవ్వుమంది కమ్మని కేక 
వయసు కందిపోయెనేడిలా 
 కొంచెం కారంగా కొంచెం గారంగా 
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా
అందించని అదిరే అదరాంజలి 
బంధించని కాలాన్ని కౌగిలి 
సుడిగాలిలా మారి చుట్టేసుకోవాలి 
మంచల్లే నిమిరే నీ జాలే
మంటల్లె నను మరిగించాలి 
కొంచెం కారంగా కొంచెం గారంగా 
కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా 

Comments