- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధ్యేయంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా
ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు
తోడైవుంటారు తోబుట్టిన బంధంలా
మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా
మేమున్నామంటారు కన్నీళ్లల్లో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పూ ఒప్పేదో సంహారం తరువాత
రణమున భగవద్గీత చదివింది మన గతచరిత
రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంటా
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకూ జవాబే ఈ జనతా
ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకి ఏమవరూ
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురూ దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
jr ntr yevvaru yevvaru song lyrics in telugu
yevvaru yevvaru song lyrics
yevvaru yevvaru song lyrics in telugu
yevvaru yevvaru song lyrics in telugu from janatha garage
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment