inthalo ennenni vinthalo song lyrics in telugu

ఇంతలో ఎన్నెన్ని వింతలో 
అలవాటులో పొరపాటులెన్నెన్నో 
సూటిగా నిను చూడలేనో 
తెరచాటుగా నిను చూశాను 
ఆయువో నువు ఆశవో 
నువు వీడనీ తుదిశ్వాసవో 
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా 

ఇంతలో ఎన్నెన్ని వింతలో 
అలవాటులో పొరపాటులెన్నెన్నో 

చిరునవ్వే నీకోసం పుట్టిందనిపిస్తుందే 
నీ ప్రేమే పంచావో ధన్యం అనిపిస్తుంది 
పడిపోయా నేనే నీకికా నువు ఎవరైతే మరి ఏంటికా 
ఉందో లేదో తీరిక ఈ రేయి ఆగాలికా 

ఇంతలో ఎన్నెన్ని వింతలో 
అలవాటులో పొరపాటులెన్నెన్నో 

పైకెంతో అణుకువగా సౌమ్యంగా ఉంటుంది 
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది 
ఆశుందో లేదో ముందుగా నువు కలిసావో ఇక పండుగ 
ఉన్నావే నువే నిండుగా నా కలలకే రంగుగా 
ఇంతలో ఎన్నెన్ని వింతలో 
అలవాటులో పొరపాటులెన్నెన్నో 
సూటిగా నిను చూడలేనో 
తెరచాటుగా నిను చూసాను 
అయువో నువు ఆశవో నువు వీడనీ తుదిశ్వాసవో 
రాయని ఓ గేయమో నువు ఎవరివో హలా 

ఇంతలో ఎన్నెన్ని వింతలో 
అలవాటులో పొరపాటులెన్నెన్నో 

Comments