komaram bheemudo song lyrics in telugu

కొమురం భీముడో కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో
కొర్రాసు నెగడు అంటే కొర్రాయి కాలే కట్టె చివర్లో జ్వాల
కొమురం భీముడో  కొమురం భీముడో
రగరాక సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో


కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల
కారడవి తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో
జులుము గద్దెకు తలను ఒంచితోగాలా
జుడుము తల్లి పేగున పెరగానట్టేరో 

కొమురం భీముడో కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో


చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల
సిలికే రక్తం సూసి సెదిరేతోగాల
బుగులేసి కన్నీరు ఒలికితోగాల
భూతల్లి సనుబాలు తాగనట్టేరో తాగనట్టేరో

కొమురం భీముడో కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో


కాలువై పారే నీ గుండె నెత్తురు
కాలువై పారే నీ గుండె నెత్తురు
నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు
అమ్మకాళ్ల పారాణైతుంది సూడు
తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు
కొమురం భీముడో కొమురం భీముడో
పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో




Comments