paala pitta song lyrics in telugu

ఏవో గుస గుసలే నాలో వలసి విడిసి వలపే విరిసే ఎదలో 

హే  పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే 
పూల బుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే 
తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే 
పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె వె వె వె వె 
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వె వె వె 

కొండలంచులో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే 
గడపకట్టిన పసుపు నీ చిలిపి ముద్దులా తాకిందే 
మలుపు తిరిగి నా మనసిట్ఠా నీవైపుకి మళ్ళిందే 
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె వె వె వె వె 
ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఎల్లా గొట్టేసినావే వె వె వె వె 

ఊ విల్లు లాంటి నీ ఒళ్ళు విసురుతుంటే బాణాలు 
గడ్డి పరకపై అగ్గి పుల్లలా భగ్గుమన్నవే నా కళ్ళు 
నీ మాటలోని రోజాలు గుచ్చుతుంటే మరి ముళ్ళు 
నిప్పు పెట్టిన తేనె పట్టులా నిద్ర పట్టదే రాత్రుళ్ళు 
నీ నడుము చూస్తే మల్లె తీగ నా మనసు దానినల్లే తూనీగ 
మెల్ల మెల్లగా చల్లినావుగా కొత్త కళలు బాగా 
పిల్లా నా గుండెల్లోనా ఇల్లే కట్టేసినావె వె వె వె వె 
కళ్ళాపు జల్లి రంగుముగ్గే పెట్టేసినావే వె వె వె వె
పాల పిట్టలో వలపు నీ పైట మెట్టు పై వాలిందే 
పూల పుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరిందే 
తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే 
పిల్లోడా గుండెలోన ఇల్లే కట్టేసినావె వె వె వె వె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ ఎల్లా గొట్టేసినావే వె వె వె వె

Comments