padara padara song lyrics in telugu

భళ్ళుమంటూ నింగివొళ్ళు విరిగెను గడ్డి పరకతోన 
ఎడారి కళ్ళు తెరచుకున్నవేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే 
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే

పదరా పదరా పదరా  నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా 
పదరా పదరా పదరా  ఈ పుడమిని అడిగిచూడు పదరా 
ఈ గెలుపను మలుపు ఎక్కడను  ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా 
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
 
నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పథమున మొదటడుగైరా
నీతరమిదిరా అనితరమిదిరా అని చాటేయ్ రా
పదరా పదరా పదరా  నీ అడుగికి పదును పెట్టి పదరా
ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా 
పదరా పదరా పదరా  ఈ పుడమిని అడిగిచూడు పదరా 
ఈ గెలుపను మలుపు ఎక్కడను  ప్రశ్నలన్నిటికి సమాధానమిదిరా 
భళ్ళుమంటూ నింగివొళ్ళు విరిగెను గడ్డి పరకతోన 
ఎడారి కళ్ళు తెరచుకున్నవేళన చినుకు పూలవాన
సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊటబావినే 
శిరస్సువంచి శిఖరమంచు ముద్దిడే మట్టినేలనే

కదిలే ఈకాలం తన రగిలే వేదనికి 
బదులల్లె విసిరిన ఆశల బాణం నువ్వేరా 
పగిలే ఇల హృదయం తన యెదలో రోదనికి 
వరమల్లె దొరికిన ఆఖరిసాయం నువ్వేరా
కనురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక 
విలపించేటి ఈభూమివొడి చిగురించేలా
పదరా పదరా పదరా  ఈ హలమును భుజముకేత్తి పదరా
ఈ నేలను ఎదకు హత్తుకుని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా 
పదరా పదరా పదరా  ఈ వెలుగును పలుగుదించి పదరా 
పగుళ్లతో పనికిరానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా 

ఏ హే హే హే హే 
ఏ హే హే హే హే 

నీలో ఈ చలనం మరి కాదా సంచలనం
చినుకల్లె మొదలై ఉప్పెన కాదా ఈ కధనం
నీలో ఈజడికి చెలరేగే అలజడికి
గెలుపల్లె మొదలై చరితగా మారే నీ పయనం
నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసాక
నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేలా
పదరా పదర పదరా  నీగతముకు కొత్త జనన మిదిరా
నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలి పునాది గది తలుపు తెరిచి పదరా
పదరా పదరా పదరా  ప్రతొక్కరి కథవు నువ్వు కదరా 
నీ ఒరవడి భవిత కలల వొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా

తనని తాను తెలుసుకున్న హలముకు పొలముతో ప్రయాణం
తనలోని ఋషిని వెలికితీయు మనిషికి లేదు ఏ ప్రమాణం 
ఉషస్సు ఎంత ఊపిరిచ్చిపెంచిన కాంతిచుక్కవో 
తరాల వెలితి వెతికి తీర్చవచ్చిన వెలుగురేఖవో ఓ 

Comments