phir shuru song lyrics in telugu

ఎగసిపడే కెరటాన్నేఆపేనా ఎవడైనా 
మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా 
చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా ఏనాడైనా
ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా
సుడిగాలిని కోసి దారిని తీసి దూకెయ్ బాణంలా
फिर शुरू चल गुरु फिर शुरू चल गुरु 

వెలుగక్కడ లేదని చెప్పే మాటేరా చీకటి అంటే 
నిశి అన్నది లేనేలేదే 
ఆరాటం తోడై ఉంటే పోరాటం మరి 
నీ వెంటే ఓటమికే చోటే లేదే 
చినుకుల నడుమన తడవక సాగే అర్జున వేగం క్షణమాగేనా 
నిలబడి పోరే నిలకడ తీరే గెలుపని చాటేలా 
फिर शुरू चल गुरु फिर शुरू चल गुरु 

మిణుగురు పురుగులు అణువంతైనా అడవిని సైతం వెలిగించెయవా 
చలి చీమలు చిరు చిగురంతైనా వనసర్పమునే గెలిచెయవా 
చుక్కలు రేణువులంతే ఉన్నా నింగిన రంగులు పొంగించెయవా 
రెక్కలు ఇంతే పిసరంతైనా దిక్కులనే శాసించెయవా 
కొమ్మల చాటున కోయిల పాటే వేకువ బాటకు పిలుపే కాదా 
నీ పిడికిలిలోని అలికిడి జగతికి మెలకువ పాఠంలా 
फिर शुरू चल गुरु फिर शुरू चल गुरु

Comments