punnami vennalake song lyrics in telugu

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ
పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ

నిజమును ముసిరిన నివురది 
ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
నిదురను చెరిపిన కలవరమేమిటి 
ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
వెలుగుకు వెనుకన వివరము ఏమిటి 
ఏమిటి ఏమిటి ఏమిటి
వేలుకు కొలువున విలయమదేమిటి 
ఏమిటి ఏమిటి ఏమిటి
పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి 
ఏమిటి ఏమిటి ఏమిటి
తలపును తొలిచెను తరగని చీకటి చీకటి చీకటి


నరుడా గురుడా ఎవరా మూలము
కాలుని పాశమై కదిలెను కాలము
జరిగెటిదిదియే దైవ మహత్యము
కానిచొ ఇదియే మానవ యత్నము
తెలియునదెప్పుడీ మాయ రహస్యము
తెలియుట మాత్రమ వశ్యమ వశ్యము
బ్రతుకొక తపముగా పరుగిడు పయనము
తలవని మలుపుగ కనుగొను విజయము
ఆఆఆఆ
ఆఆఆఆ
ఆఆఆఆ
ఆఆఆఆ
ఆఆఆఆ
ఆఆఆఆ

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ

Comments