- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఒక్కడై రావడం ఒక్కడై పోవడం
నడుమ ఈ నాటకం విధిలీలా
వెంటయే బంధము రక్త సంబంధమూ తోడుగా రాదుగా తుదివేళా
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తికాయమని
నీ బరువూ నీ పరువూ మోసేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
రాజనీ పేదని మంచనీ చెడ్డనీ భేదమే ఎరుగది యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్య్రము హద్దులే చెరిపెలే మరుభూమీ
మూటలలోని మూలధనం చేయదునేడు సహగమనం
మన వెంటా కడదంకా నడిచేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
నలుగురూ మెచ్చిన నలుగురూ తిట్టినా
విలువలే శిలువగా మోశావూ
అందరూ సుఖపడే సంఘమే కోరుతూ
మందిలో మార్గమే వేశావూ
బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా
అభిమానం అనురాగం చాటేదీ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
పోయిరా నేస్తమా పోయిరా ప్రియతమా
నీవు మా గుండెలో నిలిచావూ
ఆత్మయే నిత్యము జీవితం సత్యము
చేతలే నిలుచురా చిరకాలం
నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా
నీ వెనకే అనుచరులై నడిచారూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
ఆ నలుగురూ ఆ నలుగురూ
aa naluguru song lyrics in telugu
aa naluguru song lyrics in telugu from aa naluguru movie
rajendra prasad aa naluguru song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment