manasu maree vinthaga song lyrics in telugu

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా 
వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా 
అంతగా కవ్వింస్తావేం గిల్లి అందుకే బందించేయ్ నన్నల్లి 
కిలాడీ కోమలీ గులేబకావళీ సుఖాల జావళీ వినాలి కౌగిలీ 

ఓ అడుగులో అడుగువై ఇలా రా నాతో నిత్యం వరాననా 
హ బతుకులో బతుకునై నివేదిస్తా నా సర్వం జహాపనా 
పూలనావ గాలితోవ హైలో హైలెస్సో ఓ 
చేరనీవా చేయనీవా సేవలేవేవో ఓ 

మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళా 
ఓ వయసు మరీ వింతగా విస్తుబోతున్నదే నీదే ఈ లీలా 

మనసులో అలలయే రహస్యాలేవో చెప్పే క్షణం ఇదీ 
మనువుతో మొదలయే మరో జన్మాన్నై పుట్టే వరమిదీ 
నీలో ఉంచా నాప్రాణాన్ని చూసి పోల్చుకో ఓ 
నాలో పెంచా నీ కలలన్నీ ఊగనీ ఊయల్లో 

Comments