- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవ ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటూ బతిమాలుతున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ
నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకు చెబుతామా
లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుదామా
కలలన్నవి కలలని నమ్మనని
అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవ ఆశ నీ శ్వాసని
అందమైన హరివిల్లులతో వంతినేసి చిరుజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందని దుంటుందా
అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఒక్కసారి చెప్పలేవ నువ్వు నచ్చావని
ఓ చెంత చేరి పంచుకోవ ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటూ బతిమాలుతున్న వేళ
okkasaari cheppaleva song lyrics in telugu
okkasaari cheppaleva song lyrics in telugu from nuvvu naku nachhav movie
venkatesh aarthi agarwal okkasaari cheppaleva song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment