yedurangula vaana song lyrics in telugu

ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా 
కారణం ఎవరంటే అక్షరాల నువ్వే 
ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా 
కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే 
మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే 
పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే 
చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం 
మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం 
వినవే నందిని ఆనందిని నువ్వే అరవిందమై నన్నే చేరినావే 
నా వందనం నీకే వినవే నందిని ఆనందిని నువ్వే
ఆనందమై నన్నే తాకినావే నా వందనం నీకే 

ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లో 
నా కారణం ఎవరంటే అక్షరాల నువ్వే 
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ 
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ 

నీకంటు భాషొకటుంది అవునా 
పలికించగలవుగా రాళ్ళనైనా 
కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే 
కొత్త గొంతే వచ్చెనంటూ పులకరించే హృదయమే 

ఎవరివే నువ్వనీ వివరమే అడిగాను 
బదులుగా నాకు నే దొరికితే ఏం చేయ్ ను 
నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ 
కడలినే అడుగుతూ వడ్డునై వేచాను 

ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోనా 
కారణం ఎవరంటే అక్షరాల నువ్వే 
ఇన్నినాళ్ళుగ ఉన్నా ఇప్పుడే పుడుతున్నా 
కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే 
వినవే నందిని ఆనందిని నువ్వే 
అరవిందమై నన్నే చేరినావే 
నా వందనం నీకే వినవే 
నందిని ఆనందిని నువ్వే ఆనందమై 
నన్నే తాకినావే నా వందనం నీకే

Comments