- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
సెలయేరు పారుతుంటే ఓ పిల్లా
ఎదగుళ్ళు ఊగుతుంటే లోలోనా
నదులు అన్ని కలిసినట్టు ఓ పిల్లాగ
నవ్వెంత బాగున్నది నీ లోనా
గాజుల సప్పుడు గల్ గల్ మోగంగా
గజ్జేల పట్టిలు గంతేసి ఆడంగా
వరిగడ్డి మోపుఎత్తి ఓ పిల్లా
వయ్యారి నడుమూపవె ఈవేళ
సిగ్గు సింగారాలు సిళుకుతున్నట్టుగా
ముద్ద మందారాలు పలుకుతున్నట్టుగా
మాయ మాటలు పలకకు ఓ పిలగా
మా అన్నాలు వస్తున్నారు తోవళ్ళ
సెలయేరు పారుతుంటే ఓ పిల్లా
ఎదగుళ్ళు ఊగుతుంటే లోలొనా
పచ్చజొన్నల కంకులు ఓ పిల్లా
పాలోంచి ఓంగినాయి సేనంత
రామచిలకల చుపులు చాలింక
రత్నాల బోమ్మనైతి మాఇంటా
పచ్చజోన్నల కంకులు ఓ పిల్లా
పాలోంచి ఓంగినాయి సేనంత
రామచిలుకల చుపులు చాలింక
రత్నాల బోమ్మనైతి మాఇంటా
వేయంచు పువ్వులో వెలిగింది నీరుపు
దీపాల కాంతులో దరిచేరి నావైపు
జోడిఎడ్ల బండికట్టి ఓ పిల్లా జోరుగా ఎక్కిస్తానే ఈవేళా
ముసిముసి నవ్వింది మురిపాల జాబిల్లి
మదిలోనా పుసింది మందార సిరిమల్లె
మరుగుమాటాలావడివే ఓ బావా మా వదినాలు వస్తున్నారు తోవళ్ళ
బాయిగడ్డనపూసినై ఓ పిల్లా బంగారు కుసుమాపూలు నిండుగా
పూసిన పున్నమి వలె నేనున్నా బంగారు భూమిలెందుకోయి నాకు ఇంకా
బాయిగడ్డనపూసినై ఓ పిల్లా బంగారు కుసుమాపూలు నిండుగా
పూసిన పున్నమి వలె నేనున్నా బంగారు భుమిలేందుకోయి నాకు ఇంకా
కారెండ్ల పడివిలో కస్తురి రంగాయే వెండి కోండలమీద వేలుగున్నాలేదయే
నెమలి కన్నులదానివే ఓ పిల్లా నెలవంకా తీరున్నవే ఈ వేళ
నల్లకలువల మీద నాటు తుమ్మదవలే అడవి మల్లెల మీద ఆ చంద్రవంకాలే
కోంటే చూపులవాడివే ఓ బావా కోడళ్ళు వస్తున్నారు తోవళ్ళ
పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్లా పొద్దుంతా నిను చుస్తానే తోవళ్ళ
సింగిడి రంగులాల్ల పూసేటి సిరిజోన్నా కంకీనైతీ తోటళ్ళ
పొద్దుతిరుగుడు పువ్వుల ఓ పిల్లా పొద్దంతా నేను చుస్తానే తోవళ్ళ
సింగిడి రంగులాల్ల పూసేటి సిరిజోన్న కంకీనైతీ తోటాళ్ళ
సినుకమ్మ మెరుపమ్మ చిన్నబోయినట్టుంది
చలిమంట గిలిమంట ఎదలోన రగిలింది చిలుకా గోరింక వలే
కుడీండీ చితిమీద తోడుస్తానే ఓ పిల్లా
పాలముత్యాలన్నీ పరువాలు పలకంగా పండువెన్నెలోంచీ పందిళ్లు వేయంగా
మొగలి పువ్వులాడివే ఓ బావా మనువాడి కలిసుంటానే నీ తోడా!
మొగలి పువ్వులాడివే ఓ బావా మనువాడి కలిసుంటానే నీ తోడా
kalyan keys selayeru paduthunte song lyrics
selayeru paduthunte song lyrics in telugu
telugu folk songs
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment