Feroze Gandhi |Feroze Jehangir Gandhi

ఫిరోజ్ జహంగీర్ ఘాండీ. పండిట్ జవహర్ లాల్ నెహ్రు అల్లుడు. ఇందిరా గాంధీ భర్త. గాంధీ మహాత్ముడి దత్తత పుత్రుడు. అపర జ్ఞాని , ధైర్యశాలి అయిన ఇందిరా గాంధీ మనసు దోచుకున్నాడంటే ఆయన సామాన్యుడు కాడని అర్ధమవుతోంది. ఇంతకీ ఎవరీ ఫిరోజ్ గాంధీ? అతని కుటుంబ నేపధ్యమేమిటి ? మహాత్మా గాంధీకి దత్తపుత్రుడు ఎలా అయ్యాడు ? నెహ్రు కుమార్తె ఇందిరా ప్రియదర్శినిని ఎలా వివాహం చేసుకున్నాడు? భారత స్వాతంత్రోద్యమంలో , రాజకీయాలలో ఈయన పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

Feroze Gandhi| Feroze Gandhi relation with Gandhi

         
ఫిరోజ్ జహంగీర్ ఘాండీ1912 సెప్టెంబర్ 12 న బాంబేలో జన్మించాడు. ఫిరోజ్ జహంగీర్ ఘాండీ. తండ్రి జహంగీర్ ఫెరాడూన్ గాంధీ. తల్లి రతిమై ఘాండీ. వీరు పార్సీ కుటుంబానికి చెందినవారు. వీరికి ఫిరోజ్ తో కలిపి 5 గురు సంతానం. వీరిలో ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఫిరోజ్ జహంగీర్ ఆఖరి సంతానం. డోరబ్ జహంగీర్, ఫారీడున్ జహంగీర్ , టెహ్మినా కెర్షాష్ప్ , అలూ దస్తర్ మరియు ఫిరోజ్ జహాంగీర్. ఫిరోజ్ గాంధీ తండ్రి మొదట్లో మెరైన్ ఇంజనీర్ గా పనిచేశారు. 1920 లో ఫిరోజ్ తండ్రి మరణించారు. తన తండ్రి మరణం తర్వాత ఉత్తరప్రదేశ్ లో వున్నా అలహాబాద్ నగరంలో నివాయిస్తున్న తన సమీప బంధువు కేథరిన్ ఫ్రాంక్ దగ్గరకు వచ్చారు.
ఆమె లేడీ డిఫరన్ ఆసుపత్రిలో సర్జన్ గా పనిచేసేవారు. ఫిరోజ్ మరియు అతని తల్లి ఇద్దరు ఆమె వద్దనే ఉండేవారు.. అలహాబాద్ లో వున్న ఈవింగ్ క్రిష్టియన్ కాలేజీ లో ( 1902లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్థాపించారు. ) చదువుకుంటున్న రోజుల్లో , దేశంలో స్వతంత్రం కోసం పోరాటాలు జరుగుతూ ఉండేవి.
             
               ఫిరోజ్ 1930 లో ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఒకరోజు నెహ్రు భార్య అయిన కమల నెహ్రు, నెహ్రు కుమార్తె ఇందిరా గాంధీ మరియు చాలా మంది మహిళలు స్వాతంత్రోద్యమంలో భాగంగా ఈవింగ్ క్రిస్టియన్ కాలేజీ ముందు నిరసనలు చేపట్టారు. ఆసమయంలో కమల నెహ్రు ఎండ దెబ్బకి అస్వస్థతకు గురయ్యారు. అది చూసిన ఫిరోజ్ కమల నెహ్రూకి సహాయం చేసారు. ఇంక అంతే తానుకూడా వారితో కలిసి స్వాతంత్రోద్యమంలో  పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. ఆ మరుసటి రోజు చదువుని విడిచిపెట్టాడు.  అయితే ఫిరోజ్ గాంధీ మహాత్ముడు దేశంకోసం పోరాడటం చూసి గాంధీమహాత్ముని ఆశయాలకు ఆకర్షితుడయ్యాడు. అంతే తన పేరులోని ఘాండీని కాస్త గాంధీ గా మార్చుకున్నాడు.

                       అలాహాబాద్ లో లాల్ బహదూర్ శాస్త్రి సారధ్యంలో జరుగుతున్న స్వాతంత్రోద్యమంలో ఫిరోజ్ గాంధీ కూడా పాల్గొన్నాడు. ఈ ఉద్యమంలో శాస్త్రి తో పాటు ఫిరోజ్ గాంధీ కూడా జైలు పాలయ్యాడు. 19 నెలలు జైలులోనే గడిపాడు. తర్వాత 1932, 1933 సంవత్సరాలలో ఉద్యమంలో భాగంగా  రెండుసార్లు ఖైదు చేయబడ్డాడు. ఈ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు ఫిరోజ్ గాంధీ మరియు నెహ్రు కుటుంబాలకు చాలా సన్నిహితుడు అయ్యాడు. అంతే కాకుండా నెహ్రు భార్య కమల  నెహ్రు వద్ద కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. కమల , జవహర్ లాల్ నెహ్రు కుమార్తె పైన మనసు పారేసుకున్నాడు ఫిరోజ్. ఇందిరా పై తనకున్న ప్రేమని 1933 లో మొట్టమొదటి సారిగా వ్యక్తపరిచాడు. కానీ ఇందుకు ఇందిరా తల్లి కమల నెహ్రు అంగీకరించలేదు. ఎందుకంటే ఇందిరావయస్సు అప్పటికి 16 సంవత్సరాలు మాత్రమే. ఈ ఉద్యమాల్లో భాగంగా కమల నెహ్రు అనారోగ్యానికి గురయ్యేవారు. ఆమె టీబీ వ్యాధికి గురయ్యారు. ఆ సమయంలో నెహ్రు జైలులో వున్నారు. నెహ్రు జైలులో వున్నప్పుడు ఫిరోజ్ కమల నెహ్రు ఆరోగ్యంపై శ్రద్ధ వహించారు. కమల నెహ్రు అనారోగ్యానికి గురి అయినప్పుడు ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీ దగ్గర ఉండి , ఆమెను జాగ్రత్తగా చూసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి రానురాను క్షీణిస్తుండటంతో ఆమెను స్విడ్జర్ ల్యాండ్ కి తీసుకెళ్లారు. ఆసమయంలో ఫిరోజ్ నెహ్రు కుటుంబానికి తోడుగా వున్నారు. కమల నెహ్రు క్షయ వ్యాధితో స్విడ్జర్ ల్యాండ్ లో 1936 లో మరణించారు
Feroze Gandhi Real Name, Family
Feroze Gandhi Real Name, Family
.

               తల్లిని పోగొట్టుకున్న ఇందిరా ఒంటరి అయిపోయింది. ఎందుకంటే తండ్రి నెహ్రు స్వాతంత్రోద్యమంలో ఎక్కువ సమయం గడిపేవారు. ఇలాంటి సమయంలో ఫిరోజ్ ఆమెకు అండగా వున్నారు . వీరి ఇరువురి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.  1942 లో ఫిరోజ్ ఇందిరా గాంధీని పెళ్లి చేసుకున్నారు.

              పెళ్లి అయిన రెండు సంవత్సరాలు వీరిద్దరి బంధం బాగానే వుంది. కానీ రాజీవ్ గాంధీ పుట్టిన తర్వాత వీరు ఇద్దరు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నారు. కానీ విడాకులు తీసుకోలేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రు ప్రధానమంత్రి అయ్యాక ది నేషనల్ హెర్లాండ్ అనే పత్రికను నెహ్రు స్థాపించారు. ఈ పత్రిక భాద్యతలను ఫిరోజ్ గాంధీ చేపట్టాడు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1952 లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలి నుంచి గెలుపొందాడు.  కానీ ఇందిరా గాంధీ , ఫిరోజ్ గాంధీ మధ్య విభేదాలు రావడంతో ఇందిరా ఢిల్లీకి వెళ్లి తన తండ్రికి రాజకీయ పరంగా అండగా నిలిచింది. ఇదే క్రమంలో నెహ్రు ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై ఫిరోజ్ గాంధీ స్పందించాడు. అంతే కాకుండా వారు చేస్తున్న అక్రమాలను బయటపెట్టాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా మంది వ్యాపారస్తులు , రాజకీయ నాయకులకు దగ్గరయ్యారు. వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కలిసి ప్రజాధనాన్ని దోచుకోవడం మొదలు పెట్టారు.1955 డిసెంబర్ లో ఈ అవకతవకలను బయట పెట్టాడు ఫిరోజ్ గాంధీ.  బ్యాంకు మరియి ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ అయిన రామ్ కిషన్ దాల్మియా " బెన్నెట్ అండ్ కొలెమన్ " సంస్థను తన హస్తగతం చేసుకోవడానికి కావాల్సిన డబ్బును , ప్రజాసంస్థల నుండి అక్రమంగా డబ్బుని ఎలా తరలించారో, ప్రజాధనాన్ని, ఎలా తమ వ్యక్తిగత అవసరాలకి వాడుకున్నారో బయట పెట్టాడు.

               1957లో జరిగిన ఎన్నికలలో తిరిగి రాయ్ బరేలి నుంచి విజయం సాధించారు ఫిరోజ్ గాంధీ.  1958 లో పార్లమెంటులో  " హరిదాస్ ముద్ర " లో జరిగిన అవినీతి గురించి ప్రస్తావించాడు. హరిదాస్ ముద్ర అనినీతి మనదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద అవినీతి. ఈ అవినీతి నెహ్రు హయాంలో జరిగింది. నెహ్రు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేసాడు ఫిరోజ్ గాంధీ. అది ఎంతకీ దారి తీసిందంటే చివరికి ఆర్థిక మంత్రి అయిన టి. టి. కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. ఇది నెహ్రు ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ.

           ఫిరోజ్ గాంధీ దేశంలో అవినీతి , అక్రమాలను తగ్గించే క్రమంలో నెహ్రు నే ఎదిరించాడు. దీనితో ఫిరోజ్ గాంధీ నెహ్రు కుటుంబానికి రానురాను దూరమయ్యాడు. ఈ దూరం ఫిరోజ్ వ్యక్తిగత జీవితంపై కూడా పడింది. అయినా బెదరకుండా దేశంలో జరిగే అవినీతులపై పోరాడాడు. ఈ క్రమంలో తర్వాత జరిగిన ఎన్నికలలో ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది.  "టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ " అమ్మే రైలు ఇంజన్లు , జపనీస్ రైల్ ఇంజిన్ అమ్మే ధర కన్నా ఎక్కువ వుంది. కాబట్టి టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీని జాతీయం చేయాలన్న అంశానికి తెరలేపాడు ఫిరోజ్ గాంధీ. దీనితో ఫిరోజ్ గాంధీ పై విమర్శలు వచ్చాయి. ఎందుకంటే టాటా వాళ్ళు కూడా పార్శిలే .  ఎన్ని విమర్శలు వచ్చినా అధైర్య పడకుండా అవినీతిపై తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఈ అంశంపై చాలామందితో ప్రశంసలు కూడా అందుకున్నాడు.
Feroze Gandhi and Indira gandhi
Feroze Gandhi and Indira gandhi

                      ఇలా అవినీతిపై పోరాడుతున్న ఫిరోజ్ 1958 లో మొట్టమొదటిసారి గుండెపోటుకు గురయ్యారు. అప్పటికి ఇందిరాగాంధీ , ఫిరోజ్ ఇద్దరు విడిగానే ఉన్నారు. ఇందిరా తన తండ్రి వద్ద ఉండేవారు.  ఫిరోజ్ గాంధీకి గుండెపోటు వచ్చినప్పుడు  ఇందిరా గాంధీ భూటాన్ పర్యటనలో వున్నారు. ఈ విషయం తెలియగానే ఇందిరా గాంధీ తిరిగి భారతదేశానికి వచ్చి ఫిరోజ్ గాంధీ ని చూసుకున్నారు. సెప్టెంబర్ 8' 1960 లో విల్లింగ్ టన్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ , గుండెపోటుతో మరణించారు. కేవలం 47 సంవత్సరాల వయస్సులో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. జవహర్ లాల్ నెహ్రు అంతటి వ్యక్తిని, అతని ప్రభుత్వం చేస్తున్న అవినీతిని వ్యతిరేకించడం మామూలు విషయం కాదు. అంతటి ధైర్యవంతుడు మనదేశంలో ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటే ఇంకా ఎన్నో అక్రమాలను అడ్డుకునేవాడు. ఏది ఏమైనా మనదేశం ఒక గొప్ప ప్రజానాయకుడుని కోల్పోయింది.

                   

Comments