kannullo neeroopame song lyrics in telugu

గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్

కన్నుల్లోని నీ రూపమే
గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు
నా భాష ఈ మౌనమే
కన్నుల్లోని నీ రూపమే
గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

మది దాచుకున్న రహస్యాన్ని
వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న
 నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో
ఏమో ఎలా వేగడం

కన్నుల్లోని నీ రూపమే
గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను
మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను
నీ తెగువ చూడాలని
చూస్తూనే రేయంతా తెలవారిపోతుంటే
ఏమో ఎలా ఆపడం

కన్నుల్లోని నీ రూపమే
గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు
నా భాష ఈ మౌనమే

కన్నుల్లోని నీ రూపమే
గుండెల్లోని నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే

చిరంజీవి హిట్ సాంగ్స్ లిరిక్స్

Comments