jagada jagada song lyrics in telugu geetanjali movie

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం 
ఎగుడు దిగుడు గగనం 
మేమేరా పిడుగులం 
మరల మరల జననం రానీరా 
మరల మరల మరణం మింగేస్తాం 
భువన భగన గరళం మా పిలుపే ఢమరుకం 
మా ఊపిరి నిప్పుల ఉప్పెన 
మా ఊహలు కత్తుల వంతెన 
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే 
రంపంపంపం జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం 
ఎగుడు దిగుడు గగనం 
మేమేరా పిడుగులం 
మరల మరల జననం రానీరా 
మరల మరల మరణం మింగేస్తాం 
భువన భగన గరళం 
మా పిలుపే ఢమరుకం 

ఆడేదే వలపు నర్తనం 
పాడేదే చిలిపి కీర్తనం 
సయ్యంటే సయ్యాటలో హే హే 
మా వెనుకే ఉంది ఈ తరం 
మా శక్తే మాకు సాధనం 
ఢీ అంటే ఢిఆటలో 
నేడేరా నీకు నేస్తము రేపే లేదు 
నిన్నంటే నిండు సున్నరా రానే రాదు 
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే 
తక తకదిమి తకజణు 
జగడ జగడ జగడం చేసేస్తాం  
రగడ రగడ రగడం దున్నేస్తాం 
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా 
మరల మరల మరణం 
మింగేస్తాం భువన భగన గరళం 
మా పిలుపే ఢమరుకం 

పడనీరా విరిగి ఆకాశం 
విడిపోనీ భూమి ఈ క్షణం 
మా పాట సాగేనులే హో  
నడి రేయి సూర్యదర్శనం 
రగిలింది వయసు ఇంధనం 
మా వేడి రక్తాలకే 
ఓ మాట ఒక్క బాణము మా సిద్దాంతం 
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం 
జోహారు చెయ్యాలి లోకం 
మా జోరు చూసాక ఈనాడే 
తక తకదిమి తకజణు 

జగడ జగడ జగడం చేసేస్తాం 
రగడ రగడ రగడం 
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం 
మేమేరా పిడుగులం 
మరల మరల జననం రానీరా 
మరల మరల మరణం 
మింగేస్తాం భువన భగన గరళం 
మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన 
మా ఊహలు కత్తుల వంతెన 
మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే 
రంపంపంపం 
జగడ జగడ జగడం చేసేస్తాం 
రగడ రగడ రగడం దున్నేస్తాం 
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం 
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం 
మా పిలుపే ఢమరుకం 
తకిట తకిట తకిదిమితక  
తకిట తకిట తకిదిమితక 

Comments