vaadu nadipe bandi song lyrics in telugu

వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు 
వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు 
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు 
వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు 
వాడు వస్తుంటే వీదంతా ఇంజను సౌండు 
మోగిపోతుందే గుండెల్లో చెడుగుడు బందు 
చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండు 

వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు 
వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు 

ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుంది 
నేను ఎక్కడ ఉన్న వాడి అత్తరు ఘాటు 
నిద్దరలో పొద్దల్లె కవ్విస్తుందే 
వాడు కాలేజి కాంటీనులో కూర్చునే చోటు 
అడవిని తలపించే వాడి తలపై క్రాఫు 
ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు 
నన్నెగరేసుకు పోయాడే వాడితో పాటు 

వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు 
వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు 

వేగంగా నావైపే దూసుకు వచ్చి 
నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు 
ఒంటరిగా ఒక్కడలా తిరుగుతువుంటే 
నన్ను వేదించే వాడి వెనక ఖాళి సీటు 
దారులు చూపించు వాడి చూపుడు వేలు 
చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు 
ఏడడుగులేసి ఇచ్చుకుంట నా వందేళ్లు 

వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు 
వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు 
వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డు 
వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు

అక్కినేని నాగార్జున నటించిన సినిమాలు
గ్రీకు వీరుడూ నా రాకుమారుడూ పాట లిరిక్స్
శ్రీరామదాసు సినిమా పాటల లిరిక్స్
ఓ ప్రియా ప్రియా పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జగడ జగడ జగడం చేసేస్తాం పాట లిరిక్స్ - గీతాంజలి సినిమా
ఓ పాప లాలి పాట లిరిక్స్ - నాగార్జున గీతాంజలి సినిమా
జల్లంత కవ్వింత గీతాంజలి సినిమా పాట లిరిక్స్

Comments