rx100 movie songs| mabbulona vana villulaa song



పల్లవి :

మబ్బులోన వాన విల్లులా... 
మట్టిలోన నీటి జల్లులా.. 
గుండెలోన ప్రేమ ముల్లులా..
దాగినావుగా !! 
అందమైన ఆశతీరకా.. 
కాల్చుతుంది కొంటె కోరికా.. 
ప్రేమ పిచ్చి పెంచడానికా..చంపడానికా
కోరుకున్న ప్రేయసివే.. 
దూరమైన ఊర్వశివే.. 
జాలి లేని రాక్షసివే.. 
గుండెలోని నా కసివే.. 
చేపకల్ల రూపసివే.. 
చిత్రమైన తాపసివే.. 
చీకటింట నా శశివే.. 
సరసకు చెలి చెలి రా.. 
ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. 
నువ్వే కనబడవా.. కల్లారా.. 
నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. 
నువ్వే ఎద సడివే.. అన్నాగా.. 
ఎలా విడిచి బ్రతకనే  పిల్లా.. రా..
 నువ్వే కనబడవా.. కల్లారా.. 
నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. 
నువ్వే ఎద సడివే.. 
మబ్బులోన వాన విల్లులా.. 
మట్టిలోన నీటి జల్లులా.. 
గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా
 అందమైన ఆశతీరక.. 
కాల్చుతుంది కొంటె కోరిక 
ప్రేమ పిచ్చి పెంచడానికా .. చంపడానికా?

 చరణం 1: 

చిన్నాదానా.. ఓసి అందాల మైనా
 మాయగా మనసు జారిపడిపోయెనే
 తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే
 నీ లాగే కులికెనే నిన్నే చేరగా.. 
ఇన్నాలైనా అవెన్నేలైనా వందేల్లైనా.. 
వేచి ఉంటాను నిన్ను చూడగా 
గండాలైనా సుడి గుండాలైనా.. 
ఉంటానిలా నేను నీకే తోడుగా..
 ఓ.. ప్రేమా మనం కలిసి ఒకటిగా.. 
ఉందామా ఏదో ఎడతెగనీ.. హంగామా 
ఎలా విడిచి బతకనే పిల్లా.. రా.. 
నువ్వే కనబడవా.. 

చరణం 2:

 అయ్యో రామ.. ఓసి వయ్యారి భామ..
 నీ ఒక మరపురాని మృదుభావమే
 కిల కిల నీ నవ్వుతలుకులే 
నీ కల్ల మెరుపులే
 కవ్విస్తూ కనపడే గుండెలోతులో.. 
ఏం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా.. 
చూస్తూనే ఉన్నా.. 
కోటి స్వప్నాల ప్రేమ రూపమే
గుండె కోసి నిన్ను అందులోదాచి 
పూజించనా.. రక్త మందారాలతో.. 
కాలాన్నే.. మనం తిరిగి వెనక్కె తోద్దామా 
మళ్లీ మన కథనే.. రాద్దామా 
ఇలా విడిచి బతకనా పిల్లా రా.. నువ్వే కనబడవా

Comments