jala jala jalapatham nuvvu song lyrics in telugu


ఉప్పెన సినిమాలోని జల జల జలపాతం పాట లిరిక్స్ :-


జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కెరటాన్నవుతాను 

హే….. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే 
హే….. ఇటు చూడకంటూ మబ్బు రెమ్మ దాన్ని మూసెనే
ఏ నీటి చెమ్మ తీర్చలేని దాహమేసెనే

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కెరటాన్నవుతాను 

సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు
ఎలాగ దాగి ఉంటుంది లోపల
ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం
ఎలాగ బైట పడుతోంది ఈ వేళా
నడి ఎడారి లాంటి ప్రాణం
తడి మేఘానితో ప్రయాణం
ఇక నానుంచి నిన్ను నీ నుంచి నన్ను
తెంచలేదు లోకం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను  పొంగే వరదై పోతాను

ఇలాంటి తీపి రోజు  రాదు రాదు రోజు
ఎలాగ వెళ్ళి పోకుండా ఆపడం
ఇలాంటి వాన జల్లు  తడపదంట ఒళ్ళు
ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం
ఎపుడు లేనిది ఏకాంతం
ఎక్కడ లేని ఏదో ప్రశాంతం
మరి నాలోన నువ్వు నీలోన నేను
మనకు మనమె సొంతం

జల జల జలపాతం నువ్వు
సెల సెల సెలయేరుని నేను
సల సల నువు తాకితె నన్ను, పొంగే వరదై పోతాను
చలి చలి చలి గాలివి నువ్వు
చిరు చిరు చిరు అలనే నేను
చర చర నువ్వల్లితే నన్ను, ఎగసే కెరటాన్నవుతాను 

హీజ్ సో క్యూట్ పాట లిరిక్స్ సరిలేరు నీకెవ్వరూ సినిమా
సూర్యుడివో చంద్రుడివో పాట లిరిక్స్ - సరిలేరు నీకెవ్వరు సినిమా
సిత్తరాల సిరపడు పాట లిరిక్స్ - అల వైకుంఠపురంలో
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్

Comments