General Science Bits in Telugu part 12



251. యల్లాప్రగడ సుబ్బారావు కనుగొన్న యాంటీబయోటిక్ ఏది?

Ans: ఆరియోమైసిన్



252. పోలియో చుక్కల మందు కనుగొన్న వ్యక్తి ఎవరు?

Ans: డా “ ఆల్బర్ట్ సాబిన్ ( 1957 )


253. కుక్కకాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధికి వాక్సిన్ కనుగొన్నది ఎవరు?

Ans: లూయిపాశ్చర్


254. మసూచి వ్యాధికి వాక్సిన్ కనుగొన్నది ఎవరు?

Ans: ఎడ్వర్డ్ జెన్నర్ ( A.C 1796 )


255. మొక్కలకు నత్రజని అందించే బాక్టీరియా ఏది?

Ans: రైజోబియం, నాస్టాక్, అనబినం, అజటోబాక్టర్


256. బి.టి పత్తి, బి.టి వంగ లో బి.టి అంటే ఏమిటి?

Ans: బాసిల్లస్ తురెంజెనిసస్


257. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను ఏమని పిలుస్తారు?

Ans: వ్యాధిజనకాలు ( పాథోజన్స్ )


258. మలేరియాను కలిగించే సూక్ష్మజీవి ఏది?

Ans: ప్లాస్మోడియం


259. ఆడ ఎనాఫిలిస్ దోమ మలేరియాకు కారణమని తెలిపినది ఎవరు?

Ans: డా “రొనాల్డ్ రాస్


260. టైఫాయిడ్, కలరా, డయేరియా వంటి వ్యాధులు దేనివల్ల కలుగుతాయి?

Ans: ఈగ


261. డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు దేనివల్ల వస్తాయి?

Ans: ఎడిస్ దోమ


262. మెదడువాపు వ్యాధికి వాహకం ఏది?

Ans: ఆడ క్యూలెక్స్ దోమ


263. తట్టు, గవద బిళ్ళలుని నివారించే టీకా ఏది?

Ans: MMR టీకా


264. ఆహారాన్ని కలుషితం చేసే బాక్టీరియా ఏది?

Ans: క్లాస్ట్రీడియం బొట్యులినం



265. కలుషిత ఆహారాన్ని తినడం వల్ల కలిగే వ్యాధిని ఏమని పిలిస్తారు?

Ans: బొట్యులిజం



266. పాలను ఎన్ని డిగ్రీల వద్ద వేడిచేసి పాశరైజ్డ్ మిల్క్ ని తయారుచేస్తారు?

Ans: 72 డిగ్రీలు



267. ఆంథ్రాక్స్ వ్యాధికి టీకా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?

Ans: లూయిపాశ్చర్



268. క్రిమి సిద్ధాంతాన్ని ( germ theory ) ప్రతిపాదించినది ఎవరు?

Ans: లూయిపాశ్చర్


269. సూక్ష్మజీవుల వలన పట్టుపురుగులకు కలిగే వ్యాధులను నియంత్రన పద్ధతులు కనుగొన్నది ఎవరు?

Ans: లూయిపాశ్చర్


270. శస్త్రచికిత్సకు వాడే వస్తువులను ఏమి చేయడం వలన రోగులకు

ఇన్ఫెక్షన్ అవ్వదు?

Ans: స్టెరిలైజ్


271. పూర్తిగా అభివ్రుద్ది చెందిన పిండాన్ని ఏమని పిలిస్తారు?

Ans: బ్రూణం




272. టాడ్ పోల్ దశ నుండి ప్రౌఢ జీవిగా మారడాన్ని ఏమని పిలిస్తారు?

Ans: రూపవిక్రియ


273. బాహ్యఫలదీకరణం జరిపే జీవులకు ఉదాహరణ?

Ans: కప్ప



274. ఉభయ లైంగిక జీవులకు ఉదాహరణ ?

Ans: వానపాము


275. కణం యొక్క ప్రతిరూపాన్ని తయారుచేసే పద్ధతిని ఏమని పిలుస్తారు?

Ans: క్లోనింగ్


276. క్లోనింగ్ పద్దతిలో సృష్టించిన మొట్టమొదటి జంతువు ఏది?

Ans: గొర్రె


277. స్వరపేటికలో వున్న తొమ్మిది మ్రుదులాస్థులలో ఏది పెద్దది?

Ans: థైరాయిడ్


278. వినాళగ్రంధులు అని వేటిని పిలుస్తారు?

Ans: అంతఃస్రావ గ్రంథులు


279. అధివ్రుక్క గ్రంథి దేనిని నియంత్రిస్తుంది?

Ans: ఉద్వేగాలను


280. పాఠశాలలో ప్రవేశ పెట్టిన కార్యక్రమం ఏది?

Ans: రెడ్ రిబ్బన్ క్లబ్


Comments