General Science Bits in Telugu part 14


301. జూన్ నుండి అక్టోబర్ మధ్య పండేపంటల్ని ఏమంటారు?

Ans: ఖరీఫ్



302. ఖరీఫ్ అంటే అరబిక్ భాషలో అర్ధం ఏమిటి?

Ans: వర్షం


303. అక్టోబర్ నుంచి మార్చినెల మధ్య పండేపంటల్ని ఏమంటారు?

Ans: రబీ



304. విశ్వధాన్యపు పంట అని దేనిని పిలుస్తారు?

Ans: వరి


305. వరి పంటను మొదట ఏ యుగాల్లో సాగుచేసారు?

Ans: మీసోలిథిక్ యుగం ( B.C 9000 – B.C 8000 )

హరప్పా నాగరికత ( B.C 2300 )


306. వ్యవసాయ పనులు ప్రారంభించేటప్పుడు ఏ పండుగను

జరుపుకుంటారు?

Ans: ఏరువాక


307. విత్తనాలను నేలపై వెదజల్లే పద్దతిని ఏమంటారు?

Ans: Broadcasting


308. వేరుశెనగలో వచ్చే ఫంగస్ వ్యాధిని ఏమంటారు?

Ans: టిక్కాతెగులు


309. 1960 వ సంవత్సరం లో ఏ రచయిత్రి కీటకనాశనుల వల్ల కలిగే దుష్ఫలితాలపై సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రాశారు?

Ans: రేచల్ కార్సన్


310. సహజ ఎరువులకు మరొక పేరు?

Ans: జీవఎరువులు


311. వ్యర్థపదార్థాలను కుళ్ళింపజేసి , పోషకపదార్థాలతో కూడిన ఎరువులుగా మార్చే బాక్టీరియాలు ఏవి?

Ans: నైట్రోబాక్టర్ , అజటోబాక్టర్


312. ఎరువుల ద్వారా మొక్కలకు అందే ముఖ్య మూలకాలు ఏవి?

Ans: నైట్రొజెన్, భాస్వరం, పొటాషియం


313. N, P, K లతో కూడిన రసాయనిక ఎరువులకు ఉదాహరణ ?

Ans: DPA , సూపర్ ఫాస్పేట్ , పొటాష్


314. స్పింకర్లు ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?

Ans: నీటి పీడనం


315. ఏ రకపు ఎరువులు వేసినప్పుడు నేలకు హ్యూమస్ అందదు?

Ans: రసాయనిక ఎరువులు


316. ద్విదళ బీజ కలుపుమొక్కలను నాశనం చేయడానికి ఏ కలుపు నాశనిని ఉపయోగిస్తారు?

Ans: 2 – 4 డై క్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లం


317. పంటలు పండటానికి ఎన్ని రోజుల సమయం పట్టే పంటలను దీర్ఘకాలిక పంటలు అంటారు?

Ans: 180 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ


318. పంటలు పండటానికి ఎన్ని రోజుల సమయం పట్టే పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు?

Ans: 100 రోజులు లేదా అంతకన్నా తక్కువ



319. మానవులు కుక్కను ఎప్పుడు మచ్చిక చేసుకున్నారు?

Ans: (B.C 30,000 – B.C 7, 000)


320. మానవులు గొర్రెనుఎప్పుడు మచ్చిక చేసుకున్నారు?

Ans :( B.C 11,000 – B.C 9,000)


321. మానవులు మేకను ఎప్పుడు మచ్చిక చేసుకున్నారు?

Ans :( B.C 8,000)



322. మనదేశం లో వున్న ఆవులలో విదేశీ జాతులు ఏవి?

Ans: జెర్సి ( ఇంగ్లాండ్ )

హాల్ స్టీన్ ( డెన్మార్క్ )


323. 2011 లో నిర్వహించిన ఆర్థిక గణాంకాల ప్రకారం మనదేశం లో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

Ans: ఉత్తరప్రదేశ్


324. శ్వేతవిప్లవ పితామహుడు ఎవరు?

Ans: ప్రొఫెసర్ జె.కె కురియన్


325. పాల ఉత్పత్తిని పెంచడానికి డెయిరీ రైతులు పశువులకు ఏ హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తారు?

Ans: ఈస్ట్రొజెన్


326. ఏ నెలలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది?

Ans: అక్టోబర్, నవంబర్


327. ఏ జాతి ఆవు పాలు ఉప్పగా ఉంటాయి?

Ans: చిల్కా


328. ఈము పక్షిని తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఎక్కడ పెంచుతున్నారు?

Ans: ఆదిలాబాద్, మెదక్, నల్గొండ


329. తేనిటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?

Ans: ఎపికల్చర్


330. మన దేశం లో ఉన్న తేనెటీగల జాతులు ఏవి?

Ans: ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ప్రిగోవా

Comments