muvvala navvakala song lyrics

మువ్వలా నవ్వకలా
ముద్దమందారమా 
మువ్వలా నవ్వకలా
ముద్దమందారమా 
ముగ్గులో దించకిలా
ముగ్ధ సింగారమా

నేలకే నాట్యం నేర్పావే
నయగారమా గాలికే సంకెళ్లేశావే ఏ ఏ
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే ఏ ఏ
కలిసిన పరిచయం ఒకరోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్లతో చూసే నిజం నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో
ఓ...ఓ...ఓ...ఓ...

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయవల కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే
నయగారమా గాలికే సంకెళ్లేశావే
ఏ...ఏ... 
పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరియొక జన్మగా మొదలౌతున్నదా
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా.
ఓ...ఓ...ఓ...ఓ... 

మువ్వలా నవ్వకలా
ముద్దమందారమా
ముగ్గులో దించకిలా
ముగ్ధ సింగారమా 
ఆశకే ఆయువు పోశావే
మధుమంత్రమా 
రేయికే రంగులు పూశావే
ఏ...ఏ..

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్

Comments

Post a Comment